సమ్మర్ సినిమాలకు అతి పెద్ద గండం!

దేశవ్యాప్తంగా సినిమాలకు బాగా కలిసొచ్చే లాంగ్ సీజన్ అంటే.. వేసవే. స్టూడెంట్స్ అంతా పరీక్షలు పూర్తి చేసుకుని రిలాక్స్ అయ్యే మూడ్‌లో ఉంటారు;

Update: 2025-03-20 18:30 GMT

దేశవ్యాప్తంగా సినిమాలకు బాగా కలిసొచ్చే లాంగ్ సీజన్ అంటే.. వేసవే. స్టూడెంట్స్ అంతా పరీక్షలు పూర్తి చేసుకుని రిలాక్స్ అయ్యే మూడ్‌లో ఉంటారు. సమ్మర్లో ఏసీ థియేటర్లలో కూర్చుని సినిమాలు చూడాలని కోరుకునేవారూ పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా వేసవి సినిమాలు చూడ్డానికి ఇష్టపడే సీజన్. కానీ కొన్నేళ్లుగా ఈ సీజన్‌ను సినీ రంగం సరిగా ఉపయోగించుకోలేకపోతోంది.

కరోనా వల్ల రెండు వేసవి సీజన్లు వేస్ట్ అయిపోగా.. తర్వాత కూడా సరైన ప్లానింగ్ లేక ఈ సీజన్ దెబ్బ తింటోంది. ఈసారి కూడా అనుకున్నంత స్థాయిలో భారీ చిత్రాలు లేకపోవడం నిరాశ కలిగించేదే. ఎక్కువగా మిడ్ రేంజ్ చిత్రాలే ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. కానీ వాటికి ఐపీఎల్ రూపంలో అతి పెద్ద గండం ఎదురు కాబోతోంది.

సీజన్ సీజన్‌కూ ఐపీఎల్ క్రేజ్ పెరిగిపోతుండగా.. ఈసారి వేరే లెవెల్ అనిపిస్తోంది. ఐపీఎల్ హైప్‌తో జనాలు ఆల్రెడీ ఊగిపోతున్నారు. ఈసారి కాస్త ముందుగానే లీగ్ సందడి మొదలవుతోంది. ఇటీవలే ఇండియన్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం.. రోహిత్ శర్మ, కోహ్లి ఫాంలోకి రావడంతో ఐపీఎల్‌లో వారి ఆట చూడ్డానికి అభిమానులు అమితాసక్తితో ఉన్నారు. ఇక ధోనికి ఇదే చివరి సీజన్ కావచ్చన్న అంచనాతో అతడిపై ప్రత్యేక దృష్టి నిలిచి ఉంది.

మరోవైపు గత ఏడాది భారీ స్కోర్లతో హోరెత్తించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలా ఆడుతుందో అని క్రికెట్ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రతి టీం భారీ యాడ్స్‌తో అభిమానులను ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో లీగ్ హైప్ వేరే లెవెల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వేసవిలో రానున్న సినిమాలకు ఇబ్బంది తప్పదు. అందులోనూ వీకెండ్లో క్రేజీ మ్యాచ్‌లు, డబుల్ హెడర్స్ ఉండడంతో వాటి నుంచి సినిమాల వైపు యువతను మళ్లించడం సవాలే. చాలా బలమైన కంటెంట్‌తో వస్తే తప్ప వేసవి సినిమాలను మనుగడ సాగించడం కష్టమే.

Tags:    

Similar News