దిల్ రాజు ఫ్యామిలీ హీరోతో తెలంగాణ 'రంగస్థలం'

సుకుమార్ రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా ఆంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-03-21 10:40 GMT

దిల్ రాజు వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన యంగ్ హీరో అశీష్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క, ఇక నుంచి చేసే సినిమాలు మరో లెక్క అనేలా ముందుకు కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు యూత్‌ఫుల్ స్టోరీలతో మోడరన్ టచ్ కలిగి ఉండగా, ఈసారి మాత్రం నేటివిటీకి దగ్గరగా, పూర్తిగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. సినిమా డిజైన్, కథ, క్యారెక్టర్.. అన్ని టోటల్‌గా మాస్ అవతారమేనని సమాచారం.

సుకుమార్ రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా ఆంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఆశిష్ కూడా అదే రూట్లో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నట్లు అర్ధమవుతుంది. విలేజ్ ఎమోషనల్ డ్రామా, వైలెన్స్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని కూడా కంటెంట్ కు తగ్గట్టుగా ఉంటాయట. ఈ చిత్రానికి ఓ కొత్త దర్శకుడు మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన కథనాల ప్రకారం, తెలంగాణ మట్టిని స్పష్టంగా ప్రతిబింబించేలా కథ ఉండబోతోంది.

ఫోక్ స్టైల్, తెలంగాణ యాసతో అశీష్‌ని ఓ వేరే యాంగిల్‌లో చూడబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా, కథలో ఊరి వాతావరణం, సంస్కృతి, బతుకమ్మ ఫెస్టివల్ వంటి మూడ్ బాగా క్యాప్చర్ చేస్తారని టాక్. అటు కస్ట్యూమ్స్ నుంచీ, సాంగ్స్ వరకూ రీజనల్ ఫ్లేవర్‌ను పూర్తిగా హైలెట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందనుంది.

దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. మాస్ కమర్షియల్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తెలంగాణ ప్రామాణికత పెరగనుందని తెలుస్తోంది. అయితే అశీష్ ముందు టాస్క్ మాత్రం తక్కువేమీ కాదు.. ఇంతవరకు ఫన్‌ఫుల్ యూత్ రోల్స్‌లో కనిపించిన అతడు, పూర్తి మాస్ క్యారెక్టర్‌లో ఒదిగిపోవాలి. అది కూడా రఫ్ లుక్‌తో. అందుకోసం అతను వర్క్ షాప్ లో పాల్గొనే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రోమో షూట్ ప్రారంభమైంది. అతి త్వరలోనే వీడియో విడుదల చేయబోతున్నారు. ఈ ప్రోమో ద్వారా అశీష్ లుక్, దర్శకుడు, ఇతర కీలక వివరాలన్నీ బయటకు రానున్నాయి. నేచురల్ టచ్‌తో తెలుగు ప్రేక్షకులకు మాస్ యాక్షన్ డోస్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో యూత్‌ఫుల్ సినిమాలు చేసిన అశీష్, ఈసారి పూర్తిగా బీభత్సమైన మాస్ యాక్షన్ ఫిల్మ్‌తో రాబోతున్నాడు. తెలంగాణ స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు శిరీష్ ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇక వారి వారసుడిగా శిరీష్ బిగ్ చాలెంజ్ అయితే తీసుకుంటున్నాడు. మరి అతను మరో.రంగస్థలం లాంటి రేంజ్ హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

Tags:    

Similar News