ప్రభాస్ కోసం ఖాన్సార్ సీల్.. ఇక ఆపేది ఎవడు?
బాహుబలి అనంతరం వచ్చిన సాహో, రాధేశ్యామ్ లో ఫ్యాన్స్ కు నచ్చేలా మాస్ మసాలా ఎపిసోడ్స్ లేకపోవడంతో చప్పగా అనిపించింది.;
బాహుబలి అనంతరం వచ్చిన సాహో, రాధేశ్యామ్ లో ఫ్యాన్స్ కు నచ్చేలా మాస్ మసాలా ఎపిసోడ్స్ లేకపోవడంతో చప్పగా అనిపించింది. కానీ సలార్ 1 ఆ ఆకలి తీర్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్: సీజ్ ఫైర్ – పార్ట్ 1 భారీ అంచనాల నడుమ విడుదలై, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఘన విజయం సాధించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు రీ-రిలీజ్‌తో మరోసారి సినీ ప్రేమికులను థియేటర్లకు రప్పిస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాకు వచ్చిన మాస్ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ప్రభాస్ పవర్, నీల్ మేకింగ్ స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌లు మరోసారి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. రీ రిలీజ్ స్క్రీనింగ్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే, ఇది సాధారణ రీ రిలీజ్ సినిమా కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రేక్షకులు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని కొత్త కోణంలో చూపిస్తున్నారు.
విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరులాంటి మెట్రోల్లో భారీగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కొన్ని థియేటర్లలో సెలబ్రేషన్స్ చూస్తే.. ఇది ఓ ఫెస్టివల్ అని అనిపించకుండా ఉండదు. మాస్ మాస్‌గా మారిపోయిన సలార్ హైపర్ ఎమోషన్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ రీ-రిలీజ్‌కు సంబంధించి విశాఖపట్టణం ఫ్యాన్స్ ఎంచుకున్న ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ బుక్ చేసుకోవడం, ఆన్‌లైన్‌లో వెయిట్ చేయడం వద్దని నిర్ణయించుకున్న వీరు సినిమాలోని ఖన్సార్ సీల్ ఫార్మాట్ ట్రై చేశారు.
సాధారణంగా కొన్ని ప్రదేశాల్లో కంట్రోల్ స్టాంప్ వేస్తుంటారు కానీ, వీరు సినిమాలో హైలెట్ అయిన ఖాన్సార్ సీల్ అనే కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. సలార్ లో ఆ సీల్ ఉన్న బండిని ఆపితే ఏం జరుగుతుందో తెలుసు కదా అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక సినిమా రీ రిలీజ్ లో టిక్కెట్లకు బదులు ఖన్సార్ స్టాంప్ తయారు చేసి, చేతిపై ముద్ర వేయించుకుని థియేటర్‌లోకి ప్రవేశిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారిపోతున్నాయి.
సినిమా మొదట విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రశాంత్ నీల్ గతంలో కేజీఎఫ్ ఫ్రాంచైజీతో బిగ్ హిట్ కొట్టడం వల్ల సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? అన్న డిబేట్ పక్కన పెడితే, సినిమా యాక్షన్ పరంగా, మాస్ ఎలివేషన్స్ పరంగా ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో 1000 కోట్ల గోల్డ్ మార్క్‌ను అందుకోవడంలో కొద్దిగా తడబడ్డింది.
కానీ ఇప్పుడు రీ-రిలీజ్ సమయంలో ప్రేక్షకుల హడావుడి చూస్తుంటే, సెకండ్ పార్ట్ వస్తే రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లలో చెప్పుకోదగిన సినిమా రిలీజ్ లేకపోవడంతో, రీ-రిలీజ్ అయిన సలార్ భారీ రన్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో ప్రభాస్ క్రేజ్ అనూహ్య స్థాయికి చేరుకుంది. సినిమా చూసినవాళ్లు మరోసారి చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు.