రీల్స్ కు నో.. రొమాన్స్ కు సై
రీసెంట్ గా తన సొంత బ్యానర్ లో నిర్మించిన కోర్టు సినిమాను ఎన్నో రకాలుగా ప్రమోట్ చేసి సూపర్ హిట్ అందుకున్న నాని, ఇప్పుడు తన తర్వాతి సినిమా హిట్3 కోసం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశాడు.;
నేచురల్ స్టార్ నాని దేన్నైనా చాలా కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన ఎంచుకునే కథల నుంచి, సినిమా ప్రమోషన్స్ వరకు నాని ప్రతీదీ డిఫరెంట్ గానే చేస్తుంటాడు. అంతేకాదు, నాని ఏ సినిమాను చేసినా దాన్ని పూర్తిగా ఓన్ చేసుకుని ఆ సినిమాను ప్రమోట్ చేస్తాడు. తాను హీరోగా చేసే సినిమాలైనా, తాను నిర్మించే సినిమాలైనా ఏదైనా నాని సినిమా కోసం ప్రాణం పెడతాడు.
రీసెంట్ గా తన సొంత బ్యానర్ లో నిర్మించిన కోర్టు సినిమాను ఎన్నో రకాలుగా ప్రమోట్ చేసి సూపర్ హిట్ అందుకున్న నాని, ఇప్పుడు తన తర్వాతి సినిమా హిట్3 కోసం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కూడా నాని తన బ్యానర్ లోనే నిర్మిస్తున్నాడు. మే 1న హిట్3 రిలీజ్ కానుంది.
రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తుంది చిత్ర యూనిట్. అందులో భాగంగానే హిట్3 నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేమ వెల్లువను మార్చి 24న రిలీజ్ చేయనున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ లోపు ఇవాళ చిత్ర యూనిట్ ఓ చిన్న వీడియోను రిలీజ్ చేసింది.
ఆ వీడియో చూశాక నాని ప్రమోషనల్ ఐడియాను మెచ్చుకోకుండా ఉండరు. ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ అనగానే అందరూ సోషల్ మీడియాలో రీల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా చేయాలనుకుంటున్నారు. హిట్3 డైరెక్టర్, హీరోయిన్ కూడా అలానే ఆలోచించి ఫస్ట్ సాంగ్ రీల్ చేయాలని ప్రయత్నిస్తుండగా సీన్ లోకి నాని వచ్చి అక్కడి వారందరినీ మందలించి అర్జున్ సర్కార్ లాగా ప్రవర్తిస్తాడు. రీల్ చేసే జోడీతో పాటూ, డైరెక్టర్ పైన సీరియస్ అయిన నాని అక్కడే ఉన్న హీరోయిన్ తో మాత్రం రీల్స్ వద్దు అన్నాను.. రొమాన్స్ కాదు అని చాలా కూల్ గా చెప్తూ సినిమా థీమ్ ను అందరికీ అర్థమయ్యేలా చేశాడు.
నిర్మాణ సంస్థ షేర్ చేసిన ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్ర చాలా వయొలెంట్ గా ఉంటుందని ఆల్రెడీ రిలీజ్ చేసిన హిట్3 టీజర్ తో అర్థమైంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హిట్ ఫ్రాంచైజ్ సినిమాల్లో భాగంగా తెరకెక్కుతోంది.