'పుష్ప 2' కి దగ్గరగా వెళ్లిన మోహన్‌లాల్ L2!
కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక స్క్రీన్స్‌లో ఎల్ 2 రిలీజ్‌కి రెడీ అయింది. కేరళలో తప్ప మరెక్కడా పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.;
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ముఖ్య పాత్రలో నటించిన 'లూసీఫర్' 2019లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసీఫర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టింది. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ లూసీఫర్ రీమేక్ అయిన విషయం తెల్సిందే. చిరంజీవి హీరోగా లూసిఫర్ రీమేక్ అయింది. లూసీఫర్ కి సీక్వెల్ చేయాలని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా కాలంగా ప్లాన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సీక్వెల్‌ను పట్టాలెక్కించడం, షూటింగ్ పూర్తి చేయడంతో పాటు విడుదలకు కూడా రెడీ చేయడం జరిగింది. ఎల్ 2 : ఎంపురాన్ టైటిల్‌తో రాబోతున్న ఈ సీక్వెల్‌పై మలయాళ సినీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ తెలుగు, తమిళ్‌లో ఈ సినిమాకు అంతటి బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలం అయ్యారు.
కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక స్క్రీన్స్‌లో ఎల్ 2 రిలీజ్‌కి రెడీ అయింది. కేరళలో తప్ప మరెక్కడా పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అయినా తాజాగా ప్రారంభం అయిన బుకింగ్స్‌లో ఈ సినిమా చూపిస్తున్న జోరు చూసి అంతా షాక్ అవుతున్నారు. బుకింగ్ ప్రారంభం అయిన వెంటనే రికార్డ్ స్థాయి బుకింగ్ నమోదు అయింది. అరుదుగా మాత్రమే బుక్ మై షో లో గంటలకు లక్ష టికెట్లు బుక్ అవుతూ ఉంటాయి. పుష్ప 2 సినిమా గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. పుష్ప 2 సినిమాకు బుక్ మై షో లో రికార్డ్ స్థాయిలో బుకింగ్ నమోదు అయింది. గంటలకు లక్షకు పైగా టికెట్లు బుక్ మై షో లో బుక్ కావడంతో సరికొత్త రికార్డ్‌లు నమోదు అయ్యాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ స్థాయిలో టికెట్లు బుకింగ్ అయ్యాయి. పుష్ప 2 సినిమా బుక్ మై షో లో ఎన్నో రికార్డ్‌లను బ్రేక్ చేసింది.
తాజాగా 'ఎల్ 2' సినిమా బుక్ మై షో లో గంటలకు 96 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. మలయాళ సినీ చరిత్రలో మునుపెన్నడూ ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్ నమోదు కాలేదు. విడుదలకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ఈ స్థాయిలో బుకింగ్ నమోదు కావడం సంచలనంగా మారింది. పుష్ప 2 రికార్డ్‌కి చేరువగా ఎల్ 2 వెళ్లింది. విడుదలకు ఇంకా వారం సమయం ఉంది కనుక అప్పటి వరకు మరింతగా బుకింగ్ నమోదు కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పుష్ప 2 తర్వాత ఆ స్థాయిలో కాకున్నా గంటలకు లక్షకు దగ్గరగా బుకింగ్ నమోదు చేసిన సినిమాగా ఎల్ 2 రికార్డ్ సృష్టించింది. ముందు ముందు ఈ సినిమా మరిన్ని రికార్డ్‌లను నమోదు చేస్తుందనే నమ్మకంను మోహన్ లాల్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోకి మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఎల్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎల్ 2 అడ్వాన్స్ బుకింగ్ స్పందన చూస్తూ ఉంటే ఓపెనింగ్ డే భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మలయాళంలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఏ మేరకు వసూళ్లు నమోదు అవుతాయి అనేది చూడాలి. ఎల్ 2 : ఎంపురాన్ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను మంచి పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందించాడు. మార్చి 27న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.