2025 ఆరంభమే ఊహించని షాక్!
మాలీవుడ్ ఇండస్ట్రీ గత ఏడాది వరుస విజయాలతో పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే.;
మాలీవుడ్ ఇండస్ట్రీ గత ఏడాది వరుస విజయాలతో పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే. చిన్న బడ్జెట్ చిత్రాలే కోట్ల వసూళ్లను సాధించాయి. ఎన్నో కొత్త రికార్డులు పరిశ్రమ పేరిట నమోద య్యాయి. సినిమా మేకింగ్ విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. మూస పద్దతిని పక్కనబెట్టి సినిమాని కమర్శి యలైజ్ చేసే విధానానికి అలవాటు పడింది. అయితే 2025 ఆరంభమే మాలీవుడ్ కి బిగ్ షాక్ తగిలింది.
నివేదికల ప్రకారం ఫిబ్రవరిలో విడుదలైన 17 మలయాళ చిత్రాలలో ఒకే ఒక్క చిత్రం ` ఆఫీసర్ ఆన్ డ్యూటీ` మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 16 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ 17 చిత్రాల మొత్తం బడ్జెట్ సుమారు 73 కోట్లు. అయితే వాటి థియేట్రికల్ రిటర్న్ లు కేవలం 23.5 కోట్లు మాత్రమే. ఈ వసూళ్లు చూసి మాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. నిర్మాణ సంస్థల్లో గుబులు మొదలైంది.
సౌత్ అంతా ఫేమస్ అవుతున్న సమయంలో 16 ప్లాప్ లు మాలీవుడ్ ని మళ్లీ వెనక్కి లాగుతున్నాయా? అన్న ఆందోళన కనిపిస్తుంది. ఏడాది ఆరంభంలోనే మాలీవుడ్ కి సంక్షోభంలో పడిందా? అన్న చర్చ అంతటా మొదలైంది. అయితే 16 పరాజయాలకే ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేవలం ఫిబ్రవరి నివేదిక మాత్రమే. ఇంకా ఏడాది ముగియడానికి తొమ్మిది నెలలు సమయం ఉంది.
మాలీవుడ్ నుంచి ఏటా భారీ ఎత్తున సినిమాలు విడుదలవుతుంటాయి. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలే ఏడాది ఒక్కోక్కరు ఆరేడు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేస్తుంటారు. దీంతో ఏప్రిల్ నుంచి పరిస్థితులు మారొచ్చు అంతే వాస్తవం అన్నది గ్రహించాలి. మార్చి 27న `ఎల్2: ఎంపురాన్` భారీ అంచ నాల మధ్య రిలీజ్ అవుతుంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే వందల కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. అలాగే మరికొన్ని పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి.