సూర్య రెట్రో కొట్టి తీరాల్సిందే..?
కంగువ తర్వాత కోలీవుడ్ హీరో సూర్య చేస్తున్న సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు;
కంగువ తర్వాత కోలీవుడ్ హీరో సూర్య చేస్తున్న సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. కొన్నాళ్లుగా సూర్య మాస్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అందుకే రెట్రో సినిమాతో మరోసారి తన యాక్షన్ మోడ్ ని చూపించబోతున్నారు. కంగువ నిరాశపరచడంతో సూర్య ఫ్యాన్స్ అంతా కూడా రెట్రో మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.
కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ తో సూర్య సినిమా అనగానే మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఏర్పడ్డాయి. ముఖ్యంగా సూర్య ని వింటేజ్ లుక్ తో చూపిస్తూ చేస్తున్న రెట్రో మీఅ సూర్య ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్తుకున్నారు. ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా అంచనాలకు తగినట్టే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సూర్యతో తొలిసారి జత కడుతుంది.
పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అమ్మడి గ్లామర్ కూడా సినిమాకు హెల్ప్ అవుతుంది. రెట్రోలో పూజా హెగ్దే డీ గ్లామర్ లుక్స్ తో కనిపించనున్నారని తెలుస్తుంది. సూర్య, పూజా హెగ్దే జోడీ కూడా సినిమాలో హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో సూర్య చాలా ఫోకస్ తో పనిచేస్తున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు.
ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా మే 1న రిలీజ్ కాబోతుంది. ఐతే మే 1న నాని హిట్ 3 కూడా రిలీజ్ అవుతుంది. నాని హిట్ 3 కి సూర్య రెట్రో గట్టి పోటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సూర్య రెట్రో పై ఆ హీరో ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. విక్రం సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో కొద్దిసేపు యాక్షన్ మోడ్ లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఇక రెట్రో సినిమాలో ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో సూర్య అదరగొట్టనున్నాడు. సూర్య కార్తీక్ సుబ్బరాజ్ ఇద్దరు కలిసి ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి సూర్య అనుకునే రేంజ్ హిట్ ఈ సినిమా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.