చైతూ సినిమాలను ట్రోల్ చేస్తున్న శోభిత?
అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమించుకుని గతేడాది డిసెంబర్ 4న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే.;
అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమించుకుని గతేడాది డిసెంబర్ 4న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరిద్దరూ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాజిటివ్ గా అయినా, నెగిటివ్ గా అయినా మొత్తానికి చై, శోభిత నిరంతరం ఏదొక సందర్భంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఇటీవలే తండేల్ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ చైతన్య రీసెంట్ గానే భార్యతో కలిసి హనీమూన్ కోసం మెక్సికో వెళ్లొచ్చాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి తాజాగా వోగ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ ఇదే అవడం విశేషం.
ఈ ఇంటర్వ్యూలో చై, శోభిత ఇద్దరూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు. తమ మధ్య జరిగిన మంచి అనుభూతులతో పాటూ ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ను ఈ సందర్భంగా షేర్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉందని ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అర్థమవుతుంది. తమ వ్యక్తిగత జీవితాల గురించి కూడా చైతూ, శోభిత పలు విషయాలను పంచుకున్నారు.
సోషల్ మీడియాలో శోభిత తనను ఫాలో అవడానికంటే ముందునుంచే తాను ఆమెను ఫాలో అవుతున్నట్టు చైతన్య చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరు డ్రైవ్ చేస్తారని అడిగినప్పుడు, దానికి చైతన్య, నేను ఆమె పెట్టుకున్న డ్రైవర్‌ని అని శోభితను చూస్తూ ఎగతాళి చేస్తూ ఎంతో సరదాగా చెప్పాడు. చైతన్య శోభితను సినిమాలు ఎక్కువ చూడమని అడిగితే శోభిత అతని సినిమాలను విమర్శించింది. నీ సినిమాలు చూడటంతోనే స్టార్ట్ చేస్తానని చైతన్య ఫ్లాప్ సినిమాలను ఉద్దేశించి చైతూని సరదాగా ఆటపట్టించింది శోభిత.
అయితే శోభిత ఆటపట్టించడానికి కారణం లేకపోలేదు. చైతూ కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్లు మూడు నాలుగే ఉన్నాయి. అయితే రీసెంట్ గా నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి తో కలిసి చేసిన తండేల్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. చైతన్య సినిమాలను శోభిత విమర్శించిన నేపథ్యంలో ఆమె తండేల్ సినిమా ఇంకా చూడకపోతే ముందుగా ఆ సినిమా చూడాలని ఆడియన్స్ ఆమెను కోరుతున్నారు. తండేల్ లో చైతూ తన నటనతో అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే.