'హిట్లర్' ట్రైలర్ టాక్.. నిజమైన పవర్ డబ్బు అధికారం కాదు

ధన దర్శకత్వం వహించిన ఆ సినిమాను చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్ పై డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Update: 2024-09-19 10:35 GMT

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీకి తెలుగులో కూడా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బిచ్చగాడు మూవీతో మంచి పేరు సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ఆయన యాక్ట్ చేసిన సినిమాలు.. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న చిత్రం హిట్లర్ కూడా త్వరలో విడుదల కానుంది. ధన దర్శకత్వం వహించిన ఆ సినిమాను చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్ పై డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న హిట్లర్ మూవీలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ ఆంటోనీ కిల్లర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే మేకర్స్ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ట్రైలర్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

'ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు అధికారం కాదు ఒక మనిషిని నమ్మి వాడు వెనక ఉండే ఈ జనమే.. ఒకడు వెనుక నలుగురు నిలబడితే రౌడీ..' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో ఎవరికీ ఎలా ఎక్కడా దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. దీంతో అతడి కోసం పోలీసులు వెతుకుతుంటారు. ఆ తర్వాత ట్రైలర్ లో కనిపించి యాక్షన్ సీన్స్.. చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి.

హీరో, హీరోయిన్ రొమాంటిక్ లవ్ ట్రాక్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ క్రేజీగా చూపించారు. ఆ తర్వాత మళ్లీ ట్రైలర్ సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. 'ప్రజలు మనం చేసిన తప్పులు గుర్తుచేసుకొని ఉంటే ఎన్నికల్లో మనం ఐదు సార్లు ఎలా గెలిచే వాళ్ళం' అంటూ విలన్ ప్రశ్నించిన విధానం ఆలోచింపేజేసేలా ఉంది. ఓవరాల్ గా ట్రైలర్.. పొలిటికల్ డ్రామా, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో విజయ్ కనిపించనున్నారని మరోసారి ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. తన యాక్టింగ్ తో అదరగొట్టనున్నారని అర్థమైంది. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ అధికారిగా కనిపించి మెప్పించారు. పొలిటికల్ లీడర్ పాత్రలో చరణ్ రాజ్ అలరించారు. హీరోయిన్ రియా సుమన్ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. అలా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మరి హిట్లర్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News