50 ఏళ్ల కి సూపర్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌...!

క్రిస్‌ గెతిన్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం హృతిక్‌ రోషన్ ఫైటర్ సినిమా కోసం చాలా శ్రద్దతో డైట్ ను ఫాలో అవుతున్నాడు.

Update: 2024-01-12 07:40 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్‌ రోషన్ తాజాగా అయిదు పదుల వయసులో అడుగు పెట్టాడు. సాధారణంగా అయిదు పదుల వయసుకు చేరుకున్నారు అంటే ఫిజిక్ పరంగా చాలా వీక్ అవుతారు. కానీ హృతిక్‌ రోషన్‌ ఈ వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా తన ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ ఉంటారు.

అద్భుతమైన ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్‌ ను తాజాగా ఆయన జిమ్ ట్రైనర్ చెప్పుకొచ్చాడు. హృతిక్ వద్ద దాదాపు దశాబ్ద కాలంగా ఫిట్‌నెస్ ట్రైనర్ గా చేస్తున్న క్రిస్‌ గెతిన్ తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హృతిక్‌ ఫిట్‌నెస్ సీక్రెట్‌ ను రివీల్‌ చేశాడు.

క్రిస్‌ గెతిన్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం హృతిక్‌ రోషన్ ఫైటర్ సినిమా కోసం చాలా శ్రద్దతో డైట్ ను ఫాలో అవుతున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి, రాత్రి 9 గంటల వరకు పడుకుంటూ కేవలం గంట మాత్రమే వర్కౌట్ చేస్తూ, మితంగా తింటూ డైట్ ను ఫాలో అవుతున్నాడు.

ఏకాగ్రత మరియు పట్టుదల విషయంలో హృతిక్‌ రోషన్ ను మించిన వారు లేరు అనిపిస్తుంది. అలాంటి వారితో కలిసి వర్క్ చేయడం నాకు ఎంతో ఇష్టం. అందుకే ఇన్నాళ్లుగా ఆయన తో కలిసి వర్క్ చేస్తున్నాను. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకుంటే బాగుంటుంది అనేది ఆయనకు బాగా తెలుసు. దాన్నే ఎక్కువగా ఆయన ఫాలో అవుతారు.

వర్కౌట్‌ గంట కంటే ఎక్కువ అవసరం లేదు. చేసినంత సమయం సరిగ్గా కష్టపడితే చాలు అనేది నా అభిప్రాయం. సరిగ్గా నిద్ర పోతే వారంలో అయిదు రోజులు వర్కౌట్‌ చేస్తే చాలు. సరిగ్గా నిద్ర లేకుంటే వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే వర్కౌట్ చేస్తారు. హృతిక్ రోజుకు రెండు సార్లు కార్డియో ఎక్సర్‌ సైజ్ లు చేస్తాడు.

హృతిక్ రోజులో ఆరు నుంచి ఏడు సార్లు మితంగా తింటాడు. అవే మళ్లీ మళ్లీ తినాలి అనిపించకుంటే వాటిని జ్యూస్ రూపంలో తీసుకుంటాడు. బోరింగ్ ఫుడ్ ను కూడా హృతిక్‌ పర్సనల్ చెఫ్ చాలా రుచికరంగా మార్చుతారు. అందుకే హృతిక్ చాలా ఫిట్ గా ఉంటాడని క్రిస్ గెతిన్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News