రామ‌య్య ఫిలిం సిటీ ప్ర‌త్యేక‌త‌లెన్నో!

రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ‌వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్య‌త ఉన్న సిటీ ఇది.

Update: 2024-06-08 08:17 GMT

రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ‌వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్య‌త ఉన్న సిటీ ఇది. హైద‌రాబాద్ న‌గ‌రానికే వ‌న్నె తీసుకొచ్చిన ప్ర‌త్యేక‌మైన సిటీ. 2000 ఎక‌రాల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంది. సినిమా షూటింగ్ అంటే ముందుగా అంద‌రికీ రామోజీ ఫిలిం సిటీనే గుర్తొస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ లేకుండా ఏ సినిమా కూడా షూటింగ్ నిర్వ‌హించ‌దు. తెలుగు సినిమాలే కాదు హిందీ, త‌మిళం, క‌న్న‌డం, అన్ని భాష‌ల చిత్రాల షూటింగ్ కి ఆర్ ఎఫ్ సీ ఓ నిల‌యం లాంటింది.

ఏడాదికి కనీసం 200 సినిమాల షూటింగ్ లు అయినా ఒక్క‌డ జ‌రుగుతుంటాయి. ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 2500ల‌కు పైగా చిత్రాల షూటింగ్ జ‌రిగిన‌ట్లు ఓ అంచ‌నా. ప్ర‌పంచ దేశాల‌కే తెలుగు సినిమా ఖ్యాతిని, భార‌తీయ సినిమా స‌త్తా చాటిన `బాహుబ‌లి` షూటింగ్ అంతా దాదాపు ఆర్ ఎఫ్ సీలో వేసిన సెట్ల‌లోనే జ‌రిగింది. ఇప్ప‌టికీ ఆ సినిమా సెట్స్ అలాగే ఉన్నాయి. అటుపై ఆస్కార్ అవార్డులు తెచ్చిన `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ కూడా ఇక్క‌డే జ‌రిగింది.

ఇంకా ఎన్నో భారీ బ‌డ్జెట్ తో రూపొందిన హిందీ సినిమాల షూటింగ్ లు కూడా ఇక్కడ జ‌రిగాయి. త్వ‌ర‌లో మ‌హేష్ బాబు -రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న సినిమా షూటింగ్ కోసం కూడా ఆర్ ఎఫ్ సీ లో ప్ర‌త్యేకంగా కోట్ల రూపాయ‌లు వెచ్చించి సెట్లు నిర్మిస్తున్నారు. రామ‌య్య ఈ ఫిల్మ్ సిటీని ప్రత్యేకమైన విజన్‌తో నిర్మాణం చేసారు. భ‌విష్య‌త్ ఫిల్మ్ సిటీ ఎలా వృద్దిలోకి వ‌స్తుందో ముందే అంచ‌నా వేసి రూపొందించారు. అందులోనూ వివిధ విభాగాలను విస్తరిస్తూ వెళ్లారు.

సినిమా ప్రాసెస్ మొత్తం పూర్త‌వ్వ‌డానికి కావాల్సిన అన్ని ర‌కాల వనరులు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒక రోజులో 16 షూట్లు నిర్వ‌హించే సామ‌ర్ధ్యం ఆర్ ఎఫ్ సీకి ఉంది. సినిమాల‌కే కాదు రెగ్యుల‌ర్ ఎన్నో సీరియ‌ళ్ల షూటింగ్ లు జ‌రుగుతుంటాయి. ఇక ఈటీవీ సీరియ‌ల్ షూటింగ్ ల‌కు అయితే అది అడ్డా. ఇందులో రకరకాల దేశ విదేశీ శిల్పాలు, వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల ఫిక్స్డ్ సెట్స్ ఉన్నాయి.

1997 లో `మా నాన్నకు పెళ్లి` అనేది ఆర్ ఎఫ్ సీలో తొలి సినిమా షూట్. ఆ త‌ర్వాత నుంచి ఎన్నో సినిమాల షూటింగ్ లు అక్క‌డ జ‌రిగాయి. స్టూడియోలో అడవులు, ఉద్యానవనాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, అపార్ట్ మెంట్ బ్లాక్‌లు, భవనాలు, వర్క్‌షాప్‌లు మొదలైన అన్ని ర‌కాల సెట్లు ఉన్నాయి. ప్రతీ ఏడాది సుమారు 1.5 మిలియ‌న్ల మంది ప‌ర్యాట‌కులు ఆర్ ఫీసీని సంద‌ర్శిస్తుంటారు.

Tags:    

Similar News