నైజాం కింగ్ ప్రభాస్… లెక్క అస్సలు తగ్గట్లే..

తాజాగా రిలీజ్ అయిన డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ నైజాంలో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల బాటలో వెళ్తోంది.

Update: 2024-07-08 04:21 GMT

తెలంగాణ ఉన్న థియేటర్స్ అన్ని నైజాం ఏరియా పరిధిలోకి వస్తాయి. తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి అంటే నైజాం రైట్స్ ఎంత పలికాయి అనే ప్రశ్న వస్తుంది. అలాగే నైజాంలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అనే చర్చ కూడా నడుస్తుంది. నైజాం ఏరియాలో సినిమాలకి ఎక్కువ ప్రేక్షకాదరణ లభిస్తూ ఉంటుంది. నిజానికి ఆంధ్రా మార్కెట్ తో పోల్చుకుంటే నైజాం ఏరియా మార్కెట్ తక్కువ. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే నైజాం ఎప్పుడు డామినేషన్ లోనే ఉంటుంది.

తాజాగా రిలీజ్ అయిన డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ నైజాంలో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల బాటలో వెళ్తోంది. ఆంధ్రాలో ఇంకా బ్రేక్ ఈవెన్ కి 10 నుంచి 12 కోట్ల దూరంలో కల్కి మూవీ ఉంది. ఇదిలా ఉంటే నైజాంలో 10 ఏళ్ళ క్రితం డార్లింగ్ ప్రభాస్ కి ఎలాంటి మార్కెట్ ఉందో ఇప్పటికి అదే స్థాయి స్టామినా మార్కెట్ ఉండటం విశేషం. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే మేగ్జిమమ్ నైజాం ఏరియాలో భారీ కలెక్షన్స్ వస్తాయి. అందులో మెజారిటీ షేర్ హైదరాబాద్ నుంచి ఉంటుంది.

అన్ని భాషలకి సంబందించిన ఆడియన్స్ హైదరాబాద్ లో ప్రభాస్ సినిమాలు చూస్తారు. పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమాలు తెలుగుతో పాటు హిందీ వెర్షన్ కూడా హైదరాబాద్ థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. అందుకే ఎక్కువ కలెక్షన్స్ హైదరాబాద్ నుంచి వస్తాయి. ఇదిలా ఉంటే 2011లో నైజాంలో కలెక్షన్స్ పరంగా అత్యధిక షేర్ మూడు సార్లు అందుకున్న హీరోగా ప్రభాస్ నిలిచాడు.

అప్పట్లో 7 కోట్ల షేర్ ని ప్రభాస్ మూడు సార్లు నైజాంలో అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఫీట్ ఎవ్వరు టచ్ చేయలేదు. మరల 2024కి వచ్చేసరికి హీరోల బిజినెస్, మార్కెట్ పెరిగాయి. ఈ సారి కూడా మూడు సార్లు 60+ కోట్లకి పైగా షేర్ ని నైజాంలో అందుకున్న స్టార్ గా ప్రభాస్ అరుదైన ఫీట్ ని అందుకున్నాడు. మిగిలిన స్టార్స్ ఎవరు కూడా ఈ రికార్డ్ ని టచ్ చేయలేదు.

బాహుబలి 2, సలార్, కల్కి2898ఏడీ సినిమాలు నైజాంలో 60+ కోట్ల షేర్ ని అందుకున్న సినిమాలుగా ఉన్నాయి. వీటి బట్టి నైజాం అంటే డార్లింగ్ ప్రభాస్ అడ్డా అని మరోసారి ప్రూవ్ అయ్యింది. నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే స్పిరిట్, సలార్ 2, కల్కి 2898ఏడీ పార్ట్ 2, రాజాసాబ్ సినిమాలు కూడా నైజాంలో 60+ కోట్ల షేర్ ని దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News