TNR ఇచ్చేసుకుంటాలే: క్లాస్సీ పెప్పీ మెలోడీ
ఈ మెలోడీ పాటను ట్యూన్ కి తగ్గట్టే అంతే అందంగా చిత్రీకరించారు. ఈ పాట రవితేజ, గాయత్రి భరద్వాజ్ ల రొమాంటిక్ జర్నీని చూపుతుంది.
కేవలం కొన్ని పాటల్లో పదాలు హత్తుకుంటాయి. బాణీ గుండెల్ని టచ్ చేస్తుంది. అందునా మెలోడీ గీతాల్ని సక్సెస్ చేయడం అంటే అంత సులువేమీ కాదు. అనవసరమైన రొద ఏదీ లేకుండా సంగీతం క్లాసీగా వినిపించాలి. అప్పుడే అందరికీ కనెక్టవుతుంది. ఇప్పుడు అలాంటి ఒక క్లాసీ సాంగ్ ని సృజించాడు జీవీ ప్రకాష్‌కుమార్. ఏ.ఆర్.రెహమాన్ మేనల్లుడు పనితనం అదిరింది.
మాస్ మహారాజా రవితేజకు అదిరిపోయే పాటల్ని అందించాడు జీవీ. రాజా నటించిన టైగర్ నాగేశ్వరరావు నుండి మూడవ సింగిల్ ఇచ్చేసుకుంటాలే ఈ రోజు ఆవిష్కరించగా వైరల్ గా దూసుకెళుతోంది. బాణి వాణి రెండూ ఎంతో అందంగా కుదిరాయి. పచ్చని పొలాలు పైరగాలి నడుమ ఎంతో అందమైన అమ్మాయితో రాజా రొమాన్స్ ఒకే రేంజులో వర్కవుటైంది.
ఇక రవితేజతో పిచ్చిగా ప్రేమలో ఉన్న గాత్రి భరద్వాజ్ అతడిపై తన ప్రేమ భావాలను వ్యక్తపరిచిన తీరుకు కుర్రకారు పరేషాన్ అయిపోవడం గ్యారెంటీ. భాస్కరభట్ల అద్భుత సాహిత్యం అందించారు. సింపుల్ గా పడికట్టు పదాలతోనే బోలెడంత మ్యాజిక్ చేసే అతడు ఈసారి మరో మంచి మెలడీ పాటను అందించారు.
ఈ మెలోడీ పాటను ట్యూన్ కి తగ్గట్టే అంతే అందంగా చిత్రీకరించారు. ఈ పాట రవితేజ, గాయత్రి భరద్వాజ్ ల రొమాంటిక్ జర్నీని చూపుతుంది. సిందూరి గాత్రం ఆకట్టుకుంది. మాంటేజ్‌లు పాటను మరింత అందంగా తీర్చిదిద్దాయి. రవితేజ పొడవాటి జుట్టు గడ్డంతో మొరటుగా కనిపిస్తుండగా, గాయత్రి భరద్వాజ్ చీరలో ఆకట్టుకుంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి విలక్షణమైన పాటలను అందించారనడానికి ఇది మచ్చుకు మాత్రమే. మొదటి రెండు పాటలు ఇప్పటికే అభిమానుల్లో దూసుకెళ్లాయి.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై వంశీ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం దసరా కానుకగా ఈ నెల 20న విడుదల కానుంది. లో నుపుర్ సనన్ ఇందులో ఒక కథానాయికగా నటించింది. టైగర్ నాగేశ్వరరావు అనే స్టూవర్డ్ పురం దొంగ కథతో ఈ సినిమా తెరకెక్కింది.