ఆ హీరో సినిమా టికెట్ కొంటే స‌మోసా, టీ ప్రీ!

హిట్ సినిమాకి రీమేక్ కాబ‌ట్టి హిట్ టాక్ తెచ్చుకుంటే? అప్ప‌టి నుంచైనా పుంజుకుంటుంది అనుకుంటే అదీ జ‌ర‌గ‌లేదు.

Update: 2024-07-15 02:13 GMT

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'స‌ర్పిరా' ఇటీవ‌ల రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో త‌డబ‌డింది. అక్ష‌య్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర కార‌ణ‌మో! కంటెంట్ న‌చ్చ‌లేదో గానీ నార్త్ ఆడియ‌న్స్ కి మాత్రం ఈ చిత్రం అంతంగా రుచించ‌లేదు. అక్ష‌య్ ఇమేజ్ తో ఓపెనింగ్స్ కూడా పెద్ద‌గా రాలేదు.

హిట్ సినిమాకి రీమేక్ కాబ‌ట్టి హిట్ టాక్ తెచ్చుకుంటే? అప్ప‌టి నుంచైనా పుంజుకుంటుంది అనుకుంటే అదీ జ‌ర‌గ‌లేదు. దీంతో 'స‌ర్పిరా' థియేట‌ర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో లాభం లేద‌నుకున్న థియేట‌ర్ యాజ‌మాన్యం ఎక్కువ మంది వీక్షకులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ డెస్పరేట్ ఆఫర్‌ను ప్రవేశ పెట్టింది. టికెట్ తో పాటు కాంప్లిమెంట‌రీగా రెండు స‌మోసాలు, ఒక టీ అందిస్తుంది.

అంటే టికెట్ కొంటే ఆ రెండు ఉచితంగా పొందొచ్చు. మ‌రి కంటెట్ లేని సినిమా టికెట్ ని స‌మోసా, టీ కోసం విక్ర‌యిస్తారా? అన్న‌ది పెద్ద డౌటే. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌న్నీ ఖాళీగా ఉన్నాయి. సోమ‌వారం నుంచి ఈసినిమా థియేట‌ర్లో ఉండే అవ‌కాశం కూడా లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. రిలీజ్ కి ముందు అక్ష‌య్ ప్లాప్ ఇమేజ్ సినిమాపై ప‌డుతుందన్నారు. కానీ రిలీజ్ త‌ర్వాత క‌థ విష‌యంలో త‌ప్పిదాలు దొర్లిన‌ట్లు రివ్యూలు వ‌చ్చాయి.

స్పూర్తివంత‌మైన స్టోరీ కావ‌డంతో హిందీ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అవుతుంద‌నుకున్నారు. కానీ రివ‌ర్స్ లో జ‌రిగింది. హిట్ టాక్ తెచ్చుకుంటే గ‌నుక భారీ వ‌సూళ్లు సాధించేది. అక్ష‌య్ ప్లాప్ సెంటిమెంట్ ని తొల‌గించేది. అక్ష‌య్ సైతం సినిమాపై చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు కానీ ప‌న‌వ్వ‌లేదు. ఇదే సినిమా త‌మిళ్, తెలుగులో( ఆకాశం నీ హ‌ద్దురా) మాత్రం మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News