ఇలియానా రీఎంట్రీ… టైం వస్తుందా?
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ కొడుకు ఆలనాపాలనా చూసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తోంది. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే విషయంపై ఇలియానా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తెలుగులో ‘దేవదాసు; సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా తరువాత ‘పోకిరి’ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. ఇలియానా అంటే గ్లామర్ కి కేరాఫ్ గా ఉండేది. ఒకానొక దశలో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఇలియానా క్రేజ్ సంపాదించింది.
అయితే స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ‘జులాయి’ మూవీ తర్వాత ఈ బ్యూటీ బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో నటించింది. బర్ఫీ సక్సెస్ తో హిందీలో అడపాదడపా అవకాశాలని ఇలియానా దక్కించుకుంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు అయితే ఆమెని పూర్తిగా పక్కన పెట్టేసారు. తెలుగులో దర్శకులు కథలు చెప్పడానికి వెళ్లిన కూడా ఆమె భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసేదంట.
దీంతో ఇలియానా టాలీవుడ్ కి పూర్తిగా దూరం అయ్యింది. అదే సమయంలో తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి బ్యూటీస్ వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. అటు హిందీలో స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆమె ఆశలు నెరవేరలేదు. సీనియర్ హీరోలైన అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లకి జోడీగా కొన్ని సినిమాలలో నటించింది. అయితే పెద్దగా సక్సెస్ లు రాలేదు. తరువాత ఒక విదేశీయుడితో ప్రేమాయణం కారణంగా వచ్చిన అవకాశాలు దూరం చేసుకుంది.
అతనితో బ్రేక్ అప్ తర్వాత మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేసిన ఒకటి, రెండు సినిమాలకే పరిమితం అయ్యింది. తరువాత డోలన్ అనే విదేశీయుడితో ప్రేమలో పడింది. 2023లో అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ ఏడాది ఆగష్టులో బిడ్డకి బిడ్డకి జన్మనిచ్చింది. తరువాత అఫీషియల్ గా ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ కొడుకు ఆలనాపాలనా చూసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తోంది. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే విషయంపై ఇలియానా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.
దేనికైనా టైం రావాలని, ప్రస్తుతం అయితే తన కొడుకుని చూసుకోవడానికి సమయం సరిపోతుందని తెలిపింది. కొడుకుతో ఫుల్ టైం ఉండాలని అనుకుంటున్నట్లు ఇలియానా తెలియజేసింది. తనకి బీచ్ లు అంటే ఇష్టం అని… అందుకే ఏ దేశం వెళ్లిన కచ్చితంగా సముద్రతీరానికి వెళ్లి ప్రకృతిని ఆశ్వాదిస్తానని తెలిపింది. ఈమె ఆలోచనల బట్టి అయితే ఇప్పట్లో ఇలియానా మళ్ళీ సినిమాలలో నటించే అవకాశాలు లేనట్లే అని చెప్పాలి.