బిడ్డను తలచి కవితలు అల్లుతున్న ఇలియానా
ఇలియానా ఇన్ స్టాలో తన సోలో ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి ఇలా వ్యాఖ్యానించింది. "నేటికి ఒక సంవత్సరం క్రితం, నా చిన్న పిల్లవాడు నా లోపల పెరుగుతున్న చిన్న గసగసాల పరిమాణంలో ఉన్నాడు.
ఇలియానా కవితలు చెబుతోంది. తన చిన్నారి బాలకుడు వడివడిగా ఎదిగేస్తుంటే మాతృమూర్తిగా తనలోని ఆనందాన్ని దాచుకోలేకపోతోంది. ఏడాది క్రితం తన కడుపులో ఎదుగుతున్న బిడ్డను తలుచుకుని, ఇప్పుడు పరిమాణంలో ఎంత ఎదిగాడో కూడా ఇలియానా తెలిపింది. ఏడాది క్రితం నాలో ఉన్న నా బుజ్జాయి.. అంటూ ఇలియానా కవితలు అల్లింది. ఇలియానా ఇప్పుడు జాయ్ ఫుల్ మమ్మీ.
ఇలియానా ఇన్ స్టాలో తన సోలో ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి ఇలా వ్యాఖ్యానించింది. "నేటికి ఒక సంవత్సరం క్రితం, నా చిన్న పిల్లవాడు నా లోపల పెరుగుతున్న చిన్న గసగసాల పరిమాణంలో ఉన్నాడు. నాలో ఉన్న భావాలు, ఉత్సాహం, నరాల ఉత్తేజం.. అతడిని రక్షించడానికి .. సురక్షితంగా ఉంచడానికి ఇంకా నాకు గుర్తుంది. ఒక సంవత్సరం తర్వాత నా చిన్నారి చేతుల్లో నిద్రపోవడం చూడటం చాలా అద్భుతంగా ఉంది" అంటూ ఎమోషనల్ అయింది.
ఇలియానా డిక్రూజ్ ప్రస్తుతం మాతృత్వం తాలూకా ఆనందాన్ని ఆస్వాధిస్తోంది. తనకు జన్మించిన మగబిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్‌తో ప్రతి క్షణాన్ని ప్రేమిస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టులో తన బిడ్డను స్వాగతించినప్పటి నుండి ఇలియానా తల్లిగా తన అద్భుతమైన ప్రయాణం తాలూకా ఫోటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. ఇటీవలే కోవా తండ్రి మైఖేల్ డోలన్‌కు సంబంధించి కొంత గోప్యతను కొనసాగిస్తూనే, ఇప్పుడు అతడితో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌లో తన హబ్బీ డోలన్‌తో అరుదైన ఫోటోను పోస్ట్ చేసింది.
సింగిల్ పేరెంట్‌గా తన అనుభవం గురించి ఇన్‌స్టాలో అడిగిన ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ, "నేను కాదు " అంటూ డోలన్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి, లవ్ ఈమోజీని జోడించింది. ఫోటోలో ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌లో కూర్చొని, ఆనందకర సమయాన్ని ఆస్వాధిస్తూ.. ఒకరి కళ్లలోకి మరొకరు ప్రేమగా చూసుకోవడం కనిపించింది. కొత్తగా తల్లి అయ్యారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమై ఉంటుంది? అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఇలియానా ఇలా వ్యాఖ్యానించింది, "మేము మామాలుగా ఎంత బలంగా ఉన్నాము.. ఇప్పుడు మరింతగా" అని వ్యాఖ్యను జోడించింది.