అతడితో ముద్దుకు చాలా ఇబ్బంది పడ్డా..!
ఇమ్రాన్ హష్మీ కి కిస్సర్ గా పేరు వచ్చింది. అలాంటి నటుడితో నటించేప్పుడు హీరోయిన్స్ కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.. కొత్త అలవాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ పేరు చెప్పగానే ఒకప్పుడు సుదీర్ఘమైన ముద్దు సన్నివేశాలు గుర్తుకు వచ్చేవి. ఆయన చేసిన ఆషికిబనాయా పాట ఏ స్థాయిలో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఆ పాటలోని కంటెంట్ ను విపరీతంగా ఎంజాయ్ చేశారు.
ఇమ్రాన్ హష్మీ కి కిస్సర్ గా పేరు వచ్చింది. అలాంటి నటుడితో నటించేప్పుడు హీరోయిన్స్ కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.. కొత్త అలవాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తనూశ్రీ దత్త ఇమ్రాన్ తో నటించి మెప్పించింది. అయితే ఆయన తో కిస్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఇప్పుడు చెప్పుకొచ్చింది.
సినిమాల కంటే మీడియాలో ఈ మధ్య కాలంలో తనూశ్రీ ఎక్కువగా ఉంటున్న విషయం తెల్సిందే. ఆ మధ్య ఒక వివాదం తో వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు తాజాగా ఇమ్రాన్ హష్మీ తో తన యొక్క ముద్దు సన్నివేశాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.
ఇమ్రాన్ తో కలిసి మూడు సినిమాల్లో నటించాను. అన్ని సినిమాల్లో కూడా అతడితో కలిసి ముద్దు సన్నివేశం చేయాల్సి వచ్చింది. అతడికి నాకు బయట కెమిస్ట్రీ లేదు. ఇద్దరి మధ్య సరైన ర్యాపో కూడా లేదు. దాంతో కిస్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను ఇబ్బంది పడ్డాను.
నిజ జీవితంలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల షూటింగ్ సందర్భంగా ఆ ప్రభావం కనిపించింది. అప్పటికే ఇమ్రాన్ కి కిస్సర్ అనే ట్యాగ్ ఉంది. అయినా కూడా నేను మాత్రం ఆయనతో ఫ్రీగా ఆ సన్నివేశాలు చేయలేక పోయాను అంటూ తాజాగా వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తనూశ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.