38 భాషల్లో 3డి ఐమాక్స్ ఫార్మాట్‌లలో?
సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్త విడుదలతో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. కంగువ చారిత్రక-కల్పిత చిత్రం.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన `కంగువ` ప్రపంచవ్యాప్తంగా 38 భాషల్లో 3డి మరియు ఐమాక్స్ ఫార్మాట్‌లలో విడుదల కానుంది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్త విడుదలతో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. కంగువ చారిత్రక-కల్పిత చిత్రం. 3D - IMAX ఫార్మాట్లలో విడుదల కానుంది.
నిర్మాత K. E. జ్ఞానవేల్ రాజా ఇటీవల తన ప్రతిష్టాత్మక చిత్రం విడుదల లక్ష్యం గురించి వెల్లడించారు. ఈ చిత్రం మార్కెటింగ్ - పంపిణీ సహా ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేస్తున్నాం. కంగువతో మన పరిధిని కొత్త ప్రాంతాలకు విస్తరించడం, తద్వారా అసమానమైన బాక్సాఫీస్ విజయానికి తమిళ సినిమాకు విస్తృత అంతర్జాతీయ స్థాయికి తలుపులు తెరవడం లక్ష్యం. తమిళ పరిశ్రమ దాటని అనేక సరిహద్దులను దాటడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అన్నీ మా ప్రణాళికల ప్రకారం జరిగితే, ఈ చిత్రం అపూర్వమైన వసూళ్లను అందుకుంటుంది. దీనివల్ల తమిళ సినిమాకు మరిన్ని తలుపులు తెరుచుకుంటాయి`` అన్నారు.
కంగువ ప్రోమోలు, పోస్టర్లు సూర్య అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం రా అండ్ రస్టిక్ గ్రామీణ విజువల్ ఫీస్ట్‌గా ఉండనుంది. విఎఫ్‌ఎక్స్ - సిజిఐలపై మేకర్స్ భారీ పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. గ్రాండ్ గ్లోబల్ విడుదల కోసం స్టూడియో గ్రీన్ సంస్థ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ చిత్రం 2024 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
కంగువలో బాలీవుడ్ హాట్ గాళ్ దిశా పటాని కూడా ప్రధాన పాత్రలో నటించారు. వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇతర తారాగణం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 2024 వేసవికి కౌంట్‌డౌన్ ప్రారంభమైనందున కంగువ వెనుక ఉన్న బృందం ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రోమోలను ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం సూర్యకు మొదటి పాన్-ఇండియన్ ప్రయత్నం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 38 దేశాల్లో 3డి ఐమ్యాక్స్ ఫార్మాట్లలో విడుదల చేయడం అంటే ఇది ఎంతో సాహసంతో కూడుకున్నది. కంగువ కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ ఇలాంటి సాహసానికి సిద్ధమయ్యారు. ఏళాయుం ఆరివు తర్వాత సూర్య కెరీర్ లో మరో భారీ ప్రయోగాత్మక చిత్రంగా కంగువ రికార్డులకెక్కనుంది.