బాక్సాఫీస్: యూఎస్ టాప్ 10లిస్టులో పుష్పరాజ్ హావా
పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప: ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధిస్తోంది.
పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప: ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధిస్తోంది. అల్లు అర్జున్ పవర్ఫుల్ క్యారెక్టర్ తో పాటు, సుకుమార్ మేకింగ్ విధానం ఒక రేంజ్ లో క్లిక్కయ్యింది. ఇక దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వంటి ముఖ్య అంశాలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పుష్ప 2 చిత్రం భారతదేశంలోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా భారీ కలెక్షన్లను రాబడుతూ, ప్రస్తుతం నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో 15.28 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఐదవ స్థానంలో నిలిచింది.
ఇదే కాదు, ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో పుష్ప 2 ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా విడుదలైన మొదటి వారంలోనే భారీగా వసూళ్లు సాధించగా, ప్రదర్శన కొనసాగుతున్న ప్రతి చోట ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయం సాధిస్తోంది.
నార్త్ అమెరికాలో టాప్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో మొదటి స్థానంలో 22 మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి 2 కొనసాగుతోంది. ఆ తర్వాత 18.57 మిలియన్ డాలర్లతో కల్కి 2898 AD, 17.49 మిలియన్ డాలర్లతో పఠాన్, 15.34 మిలియన్ డాలర్లతో ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. ఇక పుష్ప 2 ఇప్పటి వరకు సాధించిన వసూళ్లతో జవాన్, అనిమల్ వంటి ఇతర భారీ చిత్రాలను అధిగమించింది.
అంతేకాకుండా, ఈ జాబితాలో పుష్ప 2 స్థానాన్ని మరింత బలపరచేలా విదేశాల్లో సినిమాకు ఇంకా మంచి ఆదరణ లభిస్తోంది. పుష్ప 2 సీక్వెల్ విజయంతో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌పై మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇస్తున్న స్పందన తెలుగుసినిమా స్థాయిని గ్లోబల్‌గా చాటి చెప్పింది.
నార్త్ అమెరికాలో టాప్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్:
1. బాహుబలి 2: $22 మిలియన్
2. కల్కి 2898 AD: $18.57 మిలియన్
3. పఠాన్: $17.49 మిలియన్
4. ఆర్ఆర్ఆర్: $15.34 మిలియన్
5. పుష్ప 2: $15.28 మిలియన్
6. జవాన్: $15.23 మిలియన్
7. అనిమల్: $15.01 మిలియన్
8. దంగల్: $12.19 మిలియన్
9. పద్మావత్: $12.17 మిలియన్
10. పీకే: $10.62 మిలియన్
టాప్ 10 రికార్డులలో ప్రభాస్ టాప్ రెండు స్థానాల్లో ఉండడం విశేషం. ఇక బాహుబలి 2ని కొట్టే సినిమా ఇప్పటివరకు రాలేదు. ఇక టాప్ 5లో అల్లు అర్జున్ పుష్ప 2 చేరడంతో టాలీవుడ్ స్థాయి మరింత పెరిగింది. యూఎస్ లో రానున్న రోజుల్లో మన హీరోలు మరీంత డామినేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.