భారతీయుడు సెన్సార్… నిడివి ఎంతంటే?

కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ జులై 12న రిలీజ్ అవుతోంది

Update: 2024-07-05 11:41 GMT

కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ జులై 12న రిలీజ్ అవుతోంది. 28 ఏళ్ళ క్రితం భారతీయుడుకి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధమైంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో భారతీయుడు 2 చిత్రం తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మరోసారి నటవిశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు. సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు.

తమిళనాట భారతీయుడు 2పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. అలాగే శంకర్ చివరిగా 2.ఓ మూవీ చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. దాని తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఎన్నో అవాంతరాలు దాటుకొని భారతీయుడు 2 చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని వస్తున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే భారతీయుడు 2 మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ సభ్యులు మంజూరు చేశారు. మూవీ నిడివి 3:04 గంటలు ఉందంట. ఓ విధంగా చెప్పాలంటే చాలా పెద్ద సినిమాగానే భారతీయుడు 2 థియేటర్స్ లోకి వస్తోంది. తాజాగా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా నడుస్తోన్న కల్కి 2898ఏడీ కూడా 3 గంటలకి పైగా నిడివి ఉన్న సినిమానే.

అయిన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా గత ఏడాది వచ్చిన యానిమల్ కూడా 3 గంటలకి పైగా నిడివి ఉన్న చిత్రమే. అయిన కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా యానిమల్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే దారిలో వస్తోన్న భారతీయుడు కూడా వాటి తరహాలోనే బ్లాక్ బస్టర్ అవుతుందని కమల్ హాసన్ అభిమానులు భావిస్తున్నారు.

Read more!

కల్కి సినిమాలో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ అద్భుతమైన నటనతో మెప్పించారు. కల్కి2లో అతని నటవిశ్వరూపం చూస్తారని క్లారిటీ వచ్చేసింది. విలన్ గా గతంలో అభయ్ సినిమాలో కమల్ హాసన్ ని చూసారు. అలాగే దశావతారం చిత్రంలో కూడా విలన్ గా నటించాడు. అయితే కల్కి సిరీస్ లో అతని పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది కమల్ నుంచి కల్కి రిలీజ్ కాగా భారతీయుడు 2 రాబోతోంది. అలాగే వచ్చే ఏడాది కూడా వీటి సీక్వెల్ అయిన కల్కి 2, భారతీయుడు 3 సినిమాలకి కమల్ అభిమానులని అలరించనున్నాయి.

Tags:    

Similar News

eac