ఇండియన్ 2.. ఆ విషయంలో పెద్ద రిస్కే..

సిద్ధార్ధ్ అవినీతిపై పోరాడే వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపిస్తాడంట. అయితే ఒకానొక సమయంలో సిద్ధార్ధ్ కోసం హాంగ్ కాంగ్ నుంచి సేనాపతి ఇండియా వస్తాడంట.

Update: 2024-06-25 04:06 GMT

అవినీతి మీద పోరాటం అనే కాన్సెప్ట్ తో 28 ఏళ్ళ క్రితం శంకర్ తెరకెక్కించిన చిత్రం ఇండియన్. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. అవినీతి చేసాడని సొంత కొడుకుని కూడా చంపేసే తండ్రిగా ఆ చిత్రంలో సేనాపతి పాత్ర ఉంటుంది. కమల్ హాసన్ ఇండియా మూవీలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశాడు.

మూవీ ఎండింగ్ లో సేనాపతి దేశం విడిచి వెళ్ళిపోతాడు. నా అవసరం పడితే తిరిగి వస్తా అని క్లైమాక్స్ లో చెబుతాడు. ఇన్నేళ్ల తర్వాత శంకర్ మరల సేనాపతిని ఇండియాకి తిరిగి తీసుకొస్తూ ఇండియన్ 2 మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా జులై 12న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. మూవీలో సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచందర్ ఇండియన్ 2 మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

ఇండియన్ కి సీక్వెల్ గా వస్తోన్న మూవీ కావడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్ తో సినిమా కంటెంట్ ఏంటనేది రివీల్ అయ్యే ఛాన్స్ ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ రన్ టైం ని శంకర్ లాక్ చేశాడంట. 2 గంటల 55 నిమిషాల నిడివితో ఇండియన్ 2 మూవీ ఉండబోతోందంట.

దాదాపు మూడు గంటలు అంటే రిస్క్ తీసుకుంటున్నారు అనే చెప్పాలి. ఇండియన్ సినిమాను అప్పట్లో 185 నిమిషాలు. అంటే మూడు గంటలు పైనే. ఇక ఈ రోజుల్లో ఆ స్థాయిలో నిడివి అంటే ఆడియెన్స్ ను మెప్పించడం మాములు విషయం కాదు. మరి శంకర్ ఆలోచనా విధానం ఎలా ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా ప్లాట్ గురించి సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ చర్చ నడుస్తోంది. సిద్ధార్ధ్ అవినీతిపై పోరాడే వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపిస్తాడంట. అయితే ఒకానొక సమయంలో సిద్ధార్ధ్ కోసం హాంగ్ కాంగ్ నుంచి సేనాపతి ఇండియా వస్తాడంట. ఇండియాలో పెరిగిపోయిన అవినీతి, లంచగొండితనం చూసి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యి ఫైట్ చేస్తాడంట. వృద్ధుడైన సేనాపతి పోరాటాన్ని శంకర్ ఆసక్తికరంగా చిత్రీకరించారంట.

సిద్ధార్ధ్ కి జోడీగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తోంది. వీరిద్దరి మీద చిత్రీకరించిన సాంగ్ కి ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఈ చిత్రం కోసం ఆమె యుద్ధ విద్యలు నేర్చుకుందంట. మరి ఆమె కూడా మూవీలో ఫైటింగ్స్ ఏమైనా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News