నెట్‌ఫ్లిక్స్ బాస్‌లను చెడా మడా తిట్టేసాడు!
నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి భారతీయ ఒరిజినల్ షో- సేక్రెడ్ గేమ్స్ కి సహ-దర్శకత్వం వహించిన భారతీయ ఫిలింమేకర్‌లలో అనురాగ్ కశ్యప్ ఒకరు.;
డబ్బు సంపాదనే ధ్యేయంగా ఓటీటీలు దివాళా కపట నాటకాలు ఆడుతున్నాయని తీవ్రంగా విమర్శించారు అనురాగ్ కశ్యప్. ఈ ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత తన మనసులో ఉన్నది ఏదీ దాచుకోరు. బహిరంగంగా విమర్శిస్తుంటారు. చాలా కాలంగా నెట్ ఫ్లిక్స్ అతడి రాడార్ పరిధిలోకి వచ్చింది.
నెట్ ఫ్లిక్స్ బాస్‌ల అవినీతి గురించి నిర్ధయగా, భయం లేకుండా విమర్శించాడు. వారిది అంతా కపటత్వం అని అన్నారు. సబ్ స్క్రిప్షన్ ల కోసం నాటకాలాడతారని విమర్శించారు కశ్యప్. నెట్‌ఫ్లిక్స్ ఇండియా బాస్‌లు నైతికంగా అవినీతిపరులు, నిజాయితీ లేనివారు అని విమర్శించారు. 2024లో తాను చేయాల్సిన మ్యాగ్జిమం సిటీ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ ఇండియా రద్దు చేసిన విషయంపై అతడి అసంతృప్తి మరోసారి బయటపడింది. స్థానిక ప్రతినిధులు, లాస్ ఏంజెల్స్ లో అవినీతి పరులను ఆయన నిలదీశారు.
కానీ దానికి భిన్నంగా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన బ్రిటిష్ డ్రామా `అడోలెసెన్స్` విషయంలో అనురాగ్ కశ్యప్ ప్రశంసా పూర్వకమైన నోట్ రాశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇంతటి సాహసోపేతమైన షో చేయడానికి ఏ ఇతర భారతీయ ఫిలింమేకర్ ని అనుమతించకపోవడాన్ని చూసి తాను అసూయపడుతున్నానని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. వ్యాఖ్యల విభాగంలో అనురాగ్ కశ్యప్ తన కోపాన్ని వెళ్లగక్కుతూ వివరణాత్మక విషయాలను రాశారు.
తన అసూయ దేని గురించి అన్నది అనురాగ్ ప్రస్థావించారు. టెడ్ సరండోస్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు. ప్రతిసారీ -కొంతకాలం పాటు కొత్త కాలంలో ప్రవేశించే సృజనాత్మకత పరిమితులను ధిక్కరించే - కెరీర్‌ను నిర్వచించే షోలు తీసేవారొస్తారు. ఇది బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లో అతడినిది పూర్తిగా వ్యతిరేక సిద్ధాంతం... అని అనురాగ్ విశ్లేషించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి భారతీయ ఒరిజినల్ షో- సేక్రెడ్ గేమ్స్ కి సహ-దర్శకత్వం వహించిన భారతీయ ఫిలింమేకర్‌లలో అనురాగ్ కశ్యప్ ఒకరు. కానీ అతడికి నెట్ ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధుల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీవలి సంవత్సరాలలో తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ.. సేక్రెడ్ గేమ్స్ సమయంలో తాను ఎదుర్కొన్న వాటిని అతడు మరోసారి గుర్తు చేసారు. సిరీస్‌ని నడిపించే అధిపతి కారణంగా తాను మూగతనాన్ని ఎదుర్కొన్నానని అనురాగ్ అన్నారు. ఇది నన్ను నిరాశపరిచింది. లాస్ ఏంజెల్స్ లోని బాస్ మద్దతుతో అత్యంత నిజాయితీ లేని నైతికంగా అవినీతిపరులైన నెట్ ఫ్లిక్స్ డాట్ ఇన్ ప్రతినిధుల సమూహంతో మనం ఇంత శక్తివంతమైన నిజాయితీ గలదాన్ని ఎలా సృష్టించగలం? అని అనురాగ్ ప్రశ్నించారు.
స్ట్రీమింగ్ దిగ్గజం టాప్ బాస్‌లను పేర్కొంటూ అనురాగ్ కశ్యప్ భారత మార్కెట్ కోసం వారి కపట విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారతీయ మార్కెట్‌పై టెడ్ - బెల్లా కపట నాటకం ఆడారని విమర్శించారు అనురాగ్. వారి ఏకైక ఆసక్తి సబ్‌స్క్రిప్షన్ల పెరుగుదల తప్ప ఇంకేదీ లేదు. ఒకప్పుడు ఎరిక్ బార్మాక్ నెట్‌ఫ్లిక్స్‌తో ఏదైనా సృష్టించడానికి ఫేస్‌బుక్‌ను సంప్రదించి, ఇప్పుడు వారు సారే జహాన్ సే అచ్చా వంటి షాట్ షోను పంపేవారు. ఇది సరిగ్గా రాసిన షో కాదు. సగం వండకం. ఇప్పటికే రెండుసార్లు దర్శకులు మారారు. ఇది నన్ను నిరాశపరిచింది.. అసూయపడేలా చేసింది. సృజనాత్మక ప్రేరణ కోసం ఇప్పటికే దక్షిణాదికి షిఫ్టయిన అనురాగ్ మెరుగైన భవిష్యత్తు కోసం ఆశిస్తున్నాడు. OTT ప్లాట్‌ఫామ్‌కు గ్రౌండ్ రియాలిటీని గుర్తు చేశాడు. అతడి వ్యాఖ్యలను ఓటీటీలు స్వీకరిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.
`అడోలెసెన్స్` అనేది జాక్ థోర్న్- స్టీఫెన్ గ్రాహం రూపొందించిన బ్రిటిష్ మినీసిరీస్. ఇది తన స్కూల్‌మేట్‌ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 ఏళ్ల బాలుడి చుట్టూ తిరుగుతుంది. ప్రతి సన్నివేశాన్ని ఒకే టేక్‌లో చిత్రీకరించారు. ఈ మినీ సిరీస్ మార్చి 13న విడుదలైంది.