లంక వైపు తారక్.. ఏం ప్లాన్ చేశావయ్యా?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.;

Update: 2025-03-20 11:30 GMT

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్లను అందించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ను పవర్ఫుల్ గా చూపించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వస్తోంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ పరిసరాల్లో షూట్ చేయగా, రీసెంట్‌గా సెట్స్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

70ల నాటి కాలాన్ని చూపించేలా డిజైన్ చేసిన సెట్స్, పాత వాహనాలు చూస్తుంటే సినిమాలో ఏదో డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్ ఉండబోతుందనే క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కథ నేపథ్యంలో మాఫియా, డ్రగ్స్ వంటి అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయనే టాక్ బలపడుతోంది. హిస్టారికల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.

ఓ సామాన్యుడిగా మొదలై, గ్లోబల్ క్రిమినల్ సిండికేట్లను ఎదుర్కొంటూ ఎదిగే ఓ మాస్ లీడర్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే లీకైన ఫోటోలలో ఆయన లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ ఎగ్సైటెడ్ అవుతున్నారు. మునుపెన్నడూ లేని రఫ్, రగ్డ్ అవతార్‌లో తారక్ కనిపించనున్నారని, ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరుగుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

లేటెస్ట్‌గా సినిమా షూటింగ్ తర్వాతి షెడ్యూల్ కోసం శ్రీలంకను ఎంపిక చేసినట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా శ్రీలంకలో ఇలాంటి పెద్ద యాక్షన్ మూవీలు షూట్ చేయడం జరగలేదు. అక్కడి ప్రకృతి దృశ్యాలు, విస్తృతమైన అడవులు, భారీ నదులు ఈ చిత్రానికి కొత్తతనాన్ని తీసుకురాబోతున్నాయి. అందుకే, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా కొన్ని ప్రధాన యాక్షన్ ఎపిసోడ్స్‌ను శ్రీలంకలో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ లొకేషన్స్ సినిమాలో ఓ కీలక పార్ట్‌ని హైలైట్ చేసేలా ఉండబోతున్నాయట. ప్రస్తుతం చిత్రబృందం అక్కడ అనుమతులు పొందే పనిలో ఉంది.

శ్రీలంకలో షూట్ చేయబోయే సన్నివేశాలు సినిమాలో అత్యంత ముఖ్యమైన సెకండ్ హాఫ్ పార్ట్‌లో భాగమని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ స్థాయిలో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. భారీ సంఖ్యలో స్టంట్ టీమ్‌ని అక్కడికి తరలించనున్నారు. హై ఓక్టేన్ ఛేజింగ్, భారీ సీన్స్ లాంటి యాక్షన్ బ్లాక్స్ ఈ లొకేషన్‌లో షూట్ చేయనున్నారు. ఇది కాకుండా అక్కడి పురాతన కట్టడాల దగ్గర కొన్ని కీలక డైలాగ్ సీన్స్ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తానికి, శ్రీలంక షెడ్యూల్ తర్వాతే సినిమా టోన్ పూర్తిగా రివీల్ అవుతుందని అంటున్నారు.

ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైగానే అవుతున్నట్లు టాక్. అందులో వీజీఎఫ్‌ఎక్స్, స్టంట్ డిజైన్, ఇంటర్నేషనల్ లొకేషన్ల కారణంగా మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే ఆ ఏడాది సమ్మర్ లోనే రావచ్చు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యంత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలవనుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓ కొత్త మార్కెట్‌ని సెట్ చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News