మ్యాడ్ స్క్వేర్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

ఇక ఇప్పుడు అదే టీమ్ ‘మ్యాడ్ స్క్వేర్’ అంటూ సీక్వెల్‌తో వచ్చేందుకు రెడీ అవుతోంది.;

Update: 2025-03-20 09:37 GMT

తెలుగు సినీ ప్రేమికుల కోసం మరో క్రేజీ ఎంటర్టైనర్ థియేటర్లకు రానుంది. ‘మ్యాడ్’ సినిమా యూత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే టీమ్ ‘మ్యాడ్ స్క్వేర్’ అంటూ సీక్వెల్‌తో వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా కామెడీ జానర్‌లో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మరోసారి హిట్ కొడతాడనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మార్చి 28న ఈ సినిమా విడుదల కానుండగా, ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి భారీ స్కేల్‌లో నిర్మించిన ఈ సినిమా మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రియాంక జవాల్కర్ కీలక రోల్‌లో కనిపించనుంది.

ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మాస్ బీట్స్ తో భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. ఇప్పుడు సినిమాకు సంబంధించి బిజినెస్ టార్గెట్ హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 23 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఈ టార్గెట్‌ను అందుకుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలుస్తుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ. 16 కోట్లకు సెట్టయ్యింది. ఈ సినిమా రిలీజ్ రోజే రాబిన్ హుడ్‌తో క్లాష్ అవుతున్నప్పటికీ, రెండు సినిమాల జానర్స్ పూర్తిగా వేర్వేరుగా ఉండటం వల్ల పెద్దగా పోటీ ఉండదనే అంచనాలు ఉన్నాయి. ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ‘మ్యాడ్’ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన విధంగానే ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటడం సులభమే.

మొత్తానికి, ఫుల్ కామేడి జానర్ లో మ్ నడిచే ఈ సినిమా వేసవి సెలవుల్లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమా మంచి వసూళ్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తే, ‘మ్యాడ్ స్క్వేర్’ మరో బిగ్ హిట్‌గా నిలవడం ఖాయం. చూడాలి మరి, ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్‌ను ఎంత త్వరగా చేరుకుంటుందో.

Tags:    

Similar News