ఇన్ని దెబ్బల తరువాత పూరి 'బెగ్గర్' ప్రయోగం!
అయితే, పూరి ఎప్పుడూ సరైన టైమ్‌లో సరికొత్త స్టైల్‌తో బౌన్స్ బ్యాక్ కావడం అతని ప్రత్యేకత.;
పూరి జగన్నాథ్ అంటే తన డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్, హీరోలకు ఇచ్చే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లతో ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. పోకిరి, బిజినెస్‌మ్యాన్, టెంపర్ లాంటి హిట్స్‌తో పూరి స్టైల్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని కథలు హీరో క్యారెక్టర్ మీద ఆధారపడి, డైలాగ్ డెలివరీ సాలిడ్‌గా ఉంటాయి. కానీ ఈమధ్య కాలంలో పూరి కొత్త తరహా సినిమాలు తీస్తున్నా, ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోతున్నాడు.
ఇప్పటికే ఇండస్ట్రీలో పూరి మార్క్ తగ్గిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్త తరహా కథలను రాయడంలో స్లో అవ్వడం, ట్రెండ్‌కు తగ్గట్టుగా మారలేకపోవడం, అతని సినిమాలపై అంచనాలు తగ్గించే పనిగా మారాయి. లైగర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ, కంటెంట్ పరంగా విఫలమవ్వడంతో పూరికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండింటి వల్లే కేవలం సినిమా పరంగా కాకుండా ఆర్థికంగా కూడా పూరి కుదేలయ్యాడు.
అయితే, పూరి ఎప్పుడూ సరైన టైమ్‌లో సరికొత్త స్టైల్‌తో బౌన్స్ బ్యాక్ కావడం అతని ప్రత్యేకత. బిజినెస్‌మ్యాన్ ముందు బుడ్డా హోగా తేరా బాప్ డిజాస్టర్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ ముందు మెహబూబా ఫ్లాప్ అయ్యింది. కానీ, ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూ మాస్ డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడే అలాంటి టైమ్ మళ్లీ వచ్చింది. ఇప్పుడు విజయ్ సేతుపతి లాంటి ప్రయోగాత్మక నటుడితో కలిసి ‘బెగ్గర్’ అనే సినిమా చేస్తున్నాడని సమాచారం.
విజయ్ సేతుపతి కథలను ఎంచుకునే విధానం అందరికీ తెలిసిందే. సాధారణమైన స్క్రిప్టులను ఒప్పుకోడు. పైగా బెగ్గర్ అనే టైటిల్‌తో పూరి నెవ్వర్ బిఫోర్ కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకురాబోతున్నాడనే అర్థమవుతోంది. ఇది పూరికి తిరిగి తన క్రేజ్ రాబట్టే ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగానే పూరి ఈసారి ఏం చూపిస్తాడో చూడాలి.
ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే పూరి తిరిగి ట్రాక్‌లోకి వస్తాడు. ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా తన స్టైల్ మారుస్తాడా లేక తన మాస్ ఎలిమెంట్స్‌తో మళ్లీ విజయాన్ని సాధిస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది. కానీ ఒక్కటి మాత్రం నిజం.. పూరి బౌన్స్ బ్యాక్ అంటే.. అది రీ-ఎంట్రీ అవ్వాల్సిందే. మరి బెగ్గర్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.