RC16 : జాన్వీ కపూర్‌కి ఉపాసన సర్‌ప్రైజింగ్ గిఫ్ట్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న RC 16 సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్‌లో జాన్వీ కపూర్ సైతం పాల్గొంటుంది. రామ్ చరణ్ సినిమా సెట్స్‌లో అప్పుడప్పుడు ఉపాసన కనిపించడం మనం చూస్తూ ఉంటాం. ఈ సినిమా సెట్స్‌లోనూ ఉపాసన సందడి చేశారు. కొన్ని గంటల పాటు RC 16 సెట్‌లో ఉపాసన సందడి చేశారు. పలువురు నటీ నటులతో ఆమె సన్నిహితంగా మాట్లాడినట్లు సమాచారం. ఉపాసన ఎంత బిజీగా ఉన్నా రామ్ చరణ్ సినిమా సెట్స్‌లో మెరవడం పరిపాటి అంటూ ఉంటారు. ఇటీవల రామ్ చరణ్‌తో పాటు RC 16 సెట్స్‌కి వెళ్లిన ఉపాసన తనతో పాటు కొన్ని ప్రత్యేక కానుకలను తీసుకు వెళ్లారట.
RC 16 సెట్స్‌లో చాలా సమయం సందడి చేసిన ఉపాసన అక్కడ ఉన్న జాన్వీ కపూర్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌ను ఇచ్చిందట. ఉపాసన తన అత్తమ్మ సురేఖ పేరు మీద అత్తమ్మాస్ కిచెన్ పేరు మీద పికిల్స్ ఇతర ఫుడ్ ఐటెమ్స్ బిజినెస్‌ను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇంటర్నెట్ ద్వారా పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఉపాసన, సురేఖ గారు కలిసి నిర్వహిస్తున్న ఈ వ్యాపారం మెల్ల మెల్లగా ఊపందుకుంటుంది. ఉపాసన తనదైన శైలిలో ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులను ఎక్కువగా ప్రమోట్ చేయడంతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
అత్తమ్మాస్ కిచెన్‌కి చెందిన వంటకాలతో జాన్వీ కపూర్‌కి ప్రత్యేకమైన ప్యాకేజ్‌ను ఉపాసన అందించారు. ఉపాసన నుంచి అందుకున్న ఆ ప్రత్యేక సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌కి జాన్వీ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. స్వతహాగా ఫుడీ అయిన ఉపాసన ఇచ్చిన బహుమానం నచ్చిందని జాన్వీ కపూర్ అన్నట్లు సమాచారం. జాన్వీ కపూర్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు, తమ అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడం బాగుంది అంటూ ఉపాసన మార్కెటింగ్‌ను ప్రతి ఒక్కరూ అభినందిస్తూ ఉన్నారు. ఉపాసన ప్రారంభించిన ఈ అత్తమ్మాస్ కిచెన్‌కి విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన దక్కుతున్నట్లు సమాచారం అందుతోంది. ఉపాసన ఏది మొదలు పెట్టిన గొప్ప స్పందన దక్కించుకుంటూ ఉంటుంది. ఇది మరో నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇక RC 16 సినిమా విషయానికి వస్తే హైదరాబాద్ షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఈ సినిమా షూటింగ్‌ను నిర్వహించబోతున్నారు. అంతే కాకుండా ఢిల్లీలోని పలు ఛారిత్రాత్మక కట్టడాల వద్ద ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఢిల్లీలో షూటింగ్ కోసం ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో షూటింగ్ కోసం అనుమతులు లభించాయి. ప్రస్తుతం హైదరాబాద్ షూటింగ్‌కి సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే హైదరాబాద్ షెడ్యూల్ పేకప్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.