3Dలో కల్కి 2898 AD.. ప్రోమో అంటే ఇలా ఉండాలి!

దీంతోపాటు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్చువల్ 3D ప్రమో విడుదల చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2025-03-20 08:06 GMT

ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకున్న చిత్రం కల్కి 2898 AD. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ గ్రాండ్ విజువల్ వండర్ విడుదలైనప్పటి నుండి ఎన్నో రికార్డులను తిరగరాసింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లను సాధించడంతో పాటు ఓటీటీలోనూ ట్రెండింగ్‌గా నిలిచింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోణె, దిశా పటానీ, షోభన కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

కల్కి 2898 AD మొదటి భాగం ఎంత హైప్ క్రియేట్ చేసిందో, రెండో పార్ట్‌పై అంతకంటే ఎక్కువ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతూ టీమ్ గ్రాండ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ నెల 23న కల్కి 2898 AD జీ తమిళ్‌లో సాయంత్రం 3 గంటలకు ప్రసారం కానుంది. ఇది ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందిన తర్వాత టెలివిజన్ ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందించనుంది.

దీంతోపాటు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్చువల్ 3D ప్రమో విడుదల చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేటెస్ట్ 3D ప్రమో విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అందులో సినిమాలోని అద్భుతమైన సన్నివేశాలను కొత్తగా 3D టెక్నాలజీతో ప్రెజెంట్ చేశారు. విజువల్ ట్రీట్‌గా మారిన ఈ ప్రమో నెట్‌లో వైరల్ అవుతూ.. ‘ఇలా ప్రమోషన్స్ చేయాలి.. ప్రోమో అంటే ఇలా ఉండాలి’ అంటూ ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

"ఇది టీవీ ప్రీమియర్‌కు ఇచ్చే హైప్ మాత్రమే అయితే, సినిమా రోజు హడావుడి ఇంకెంత రేంజ్‌లో ఉంటుందో?" అంటూ సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా గుర్తుండిపోతుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత గొప్పతనాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు 3D ప్రమోతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

ఇకపోతే కల్కి 2898 AD సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. మొదటి పార్ట్‌ను చూస్తే, రెండో పార్ట్‌ మరింత గ్రాండ్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు. కల్కి 2898 AD ప్రపంచ స్థాయి ప్రమోషన్స్, స్టోరీ స్కేల్, సాంకేతికత ఇలా అన్ని విషయాల్లో ఇండియన్ సినిమాకు ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఇక సెకండ్ పార్ట్ షూటింగ్ సమ్మర్ అనంతరం మొదలయ్యే అవకాశం ఉంది.

Full View
Tags:    

Similar News