నాగ చైతన్య నెక్ట్స్.. కొత్త దర్శకుడితో మరో ఎక్స్‌పెరిమెంట్?

నాగ చైతన్య కెరీర్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. రీసెంట్ గా వచ్చిన తండేల్ సినిమా నటుడిగా కూడా అతనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది.;

Update: 2025-03-20 10:30 GMT

నాగ చైతన్య కెరీర్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. రీసెంట్ గా వచ్చిన తండేల్ సినిమా నటుడిగా కూడా అతనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా చైతు తన మొదటి ₹100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన ఈ బిగ్ హిట్, ఆయన కెరీర్‌ను కొత్త దశలోకి తీసుకెళ్లింది. సినిమా విడుదల తర్వాత నాగచైతన్య పై ఉన్న క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. సాయి పల్లవి, చందూ మొండేటి కాంబినేషన్ మరోసారి అద్భుతమైన విజయం అందించింది.

ఇప్పుడు నాగ చైతన్య తన తదుపరి ప్రాజెక్టులపై మరింత ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సూపర్ న్యాచురల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. అంతు చిక్కని రహస్యం చుట్టూ కొనసాగే ఆ పాత్రను దర్శకుడు డిఫరెంట్ గా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయ్యాక NC25 పై ఫుల్ క్లారిటీ రానుంది.

ఇక న్యూ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. తండేల్ ఇచ్చిన బూస్ట్‌తో చైతు కొత్త కథలపై మరింత ఆసక్తిగా ఉన్నాడట. లేటెస్ట్ సమాచారం ప్రకారం, నాగ చైతన్య కొత్త దర్శకుడు కిషోర్‌తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కథ వినగానే ఆయన క్యారెక్టర్‌ని ఎంతగానో ఇష్టపడి వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు.

సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ వార్త వైరల్ అవుతోంది. ఇది పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్నదని టాక్. ఇప్పటి వరకు చైతన్య ఎక్కువగా ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాల్లో కనిపించినా, తండేల్ తర్వాత ఆయన కొత్త జానర్స్‌ను ట్రై చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త దర్శకుడితో ప్రయోగం చేయడం ఆయనకు సరికొత్త ఛాలెంజ్ అవుతుందని చెబుతున్నారు.

గతంలో కూడా మజిలీ, లవ్ స్టోరీ వంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్‌ను మరింత హైలెట్ చేసిన చైతు, ఇప్పుడు హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్‌లను ఎంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడనప్పటికీ, నాగ చైతన్య తదుపరి సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. తండేల్ వంటి హిట్ తర్వాత ఆయన ఏదైనా కొత్తదనంతో కూడిన కథ ఎంచుకుంటే, అది మరో సెన్సేషన్ అవ్వడం ఖాయం. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News