అక్కడ నెంబర్ -1 చైర్ ఖాళీగానే!
ఈ నేపథ్యంలో నెంబర్ వన్ పై చర్చ ఆసక్తికరంగా మారింది.;
కోలీవుడ్ లో నెంబర్ చైర్ ఖాళీగానే ఉందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్...విశ్వనటుడు కమల్ హాసన్ ఉన్నా? వాళ్లిద్దరు సీనియర్ కోటాలోకి వెళ్లిపోతారు. నెంబర్ వన్ ర్యాకింగ్ ను వాళ్లెప్పుడో చూసేసారు. ఆ తర్వాత జనరేషన్ హీరోల్లో నెంబర్ వన్ ఎవరు? అంటే తల అజిత్ పేరు వినిపించింది. కోలీవుడ్ లో కోట్లాది మంది అభిమానించే స్టార్ గా విజయ్ కి పేరుంది.
అతడి పేరు మీద ప్రత్యేకమైన అభిమాన సంఘాలున్నాయి. అయితే ఇప్పుడాయన రాజకీయాల్లోకి వెళ్లి పొతున్నారు. జన నాయకుడిగా ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నారు. 169 వ చిత్రం 'జన నాయగన్' రిలీజ్ తర్వాత విజయ్ వెండి తెరపై కనిపించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నెంబర్ వన్ పై చర్చ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడా స్థానం అజిత్ కి ఇవ్వలన్నా? ఆయనా యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు.
కారు రేసింగ్ పై ఉన్న ఆసక్తి సినిమాల మీద చూపించడం లేదు. అజిత్-విజయ్ అభిమానుల మధ్య కోలీవుడ్ లో తగ్గా వార్ ఎలా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు. నెంబర్ వన్ స్థానం కోసం ఇద్దరు పోటీ పడేవారు. అయినా అజిత్ కంటే ఓ మెట్టు విజయ్ పైన ఉండటంతో? ఇంతకాలం అతడికే దక్కింది. అజిత్ ప్రస్తుతం సినిమాలు తగ్గించిన నేపథ్యంలో ఇప్పుడా స్థానానికి ఆయనా అర్హుడు కాదు.
మిగతా స్టార్లు విక్రమ్, సూర్య, కార్తీ, ధనుష్, విజయ్ సేతుపతి లాంటి వారు రేసులో ఉన్నారు. కానీ ప్రజల్లో ఆదరణ...అభిమానుల్లో అభిమానం అన్నది విజయ్-అజిత్ రేంజ్ లో కనిపించలేదు. సక్సెస్ పరంగానూ వాళ్లంతా సరి సమానంగానే కొన సాగుతున్నారు. విజయ్ సేతుపతి ప్యూచర్ లో రజనీ అంత పెద్ద స్టార్ అవుతాడని ఇప్పటికీ ఉంది. కానీ ఇంకా అది జరగలేదు. కాబట్టి మక్కల్ సెల్వన్ కి ఇప్పుడే ఇండస్ట్రీ ఆ స్థానం ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఇంకొన్నాళ్లు నెంబర్ వన్ చైర్ ఖాళీగానే ఉంటుంది.