ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు
కోలీవుడ్ హీరో సూర్య ను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.;
కోలీవుడ్ హీరో సూర్య ను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అందరూ సూర్య మరియు అతని ఫ్యామిలీ జ్యోతికను సినిమాల్లోకి వద్దని చెప్పారని అనుకున్నారు. ఆ విషయంపై జ్యోతిక రీసెంట్ గా ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. సైతాన్ సినిమాతో బాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న జ్యోతిక, రీసెంట్ గా డబ్బా కార్టెల్ సిరీస్ తో ఆకట్టుకుని, 46 ఏళ్ల వయసులో కూడా తన సత్తా చాటుతోంది.
వరుస సక్సెస్‌లతో ఫామ్ లోకి వచ్చిన జ్యోతిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో సూర్య మరియు అతని ఫ్యామిలీ తనను నటనలోకి వద్దన్నారని వస్తున్న వార్తలన్నీ నిజం కాదని స్పష్టం చేసింది. పెళ్లయ్యాక తాను సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నప్పుడు సినిమాల్లోకి మళ్లీ ఎప్పుడొస్తావని సూర్యనే తనను రెగ్యులర్ గా అడుగుతూ ఉండేవాడని తెలిపింది.
తాను నటించిన పాత సినిమాలు టీవీ లో వచ్చేటప్పుడు సూర్యకు ఎలాంటి మెసేజెస్ వస్తాయో కూడా జ్యోతిక ఈ సందర్భంగా షేర్ చేసుకుంది. జ్యో మూవీ టీవీలో వచ్చింది. ఆమె ఎంతో బాగా చేసింది. ఎందుకు ఆమెను సినిమాల్లో నటించనీయడం లేదని సూర్యకు కొంతమంది మెసేజ్‌లు పంపేవారని, ఆ మెసేజ్‌లను సూర్య తనకు ఫార్వార్డ్ చేసేవాడని జ్యోతిక గుర్తుచేసుకుంది.
ప్రస్తుతం డబ్బా కార్టెల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జ్యోతిక, త్వరలోనే సైతాన్ సీక్వెల్ ను చేయనుంది. దాంతో పాటూ అమెజాన్ ప్రైమ్ కోసం ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఓ వెబ్ సిరీస్ లో కూడా జ్యోతిక నటించనుంది. మొత్తానికి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ బిజీబిజీగా సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది. అయితే జ్యోతిక ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసినట్టు అర్థమవుతుంది.