RC 17.. వన్ ఇయర్ లో ఫినిష్ చేస్తారా..?

ఐతే ఆర్సీ 16 తర్వాత ఆర్సీ 17 సినిమా కూడా ఓకే అయిన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా ఆ సినిమా రాబోతుంది.;

Update: 2025-03-20 02:45 GMT

గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. బుచ్చి బాబు చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో గ్లోబల్ స్టార్ రాం చరణ్ ఈసారి మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఆర్సీ 16 గా రాబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసి భారీ ప్లానింగ్ తో వెళ్తున్నాడు బుచ్చి బాబు.

ఐతే ఆర్సీ 16 తర్వాత ఆర్సీ 17 సినిమా కూడా ఓకే అయిన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా ఆ సినిమా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఈ సినిమా వస్తుంది. ఐతే బుచ్చి బాబు సినిమా పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుకుమార్ సినిమా చేయాలని చూస్తున్నాడు రామ్ చరణ్. ఆర్సీ 17 సినిమా విషయంలో సుకుమార్ మాస్టర్ ప్లానే వేసినట్టు తెలుస్తుంది.

ఆర్సీ 16 సినిమా నెక్స్ట్ ఇయర్ దాకా పట్టేలా ఉంది. ఈలోగా కంప్లీట్ ప్రీ ప్రొడక్షన్ ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు చరణ్ కి సంబందించిన పోర్షన్స్ కాకుండా మిగతా పార్ట్ ముందే షూట్ చేసేలా చూస్తున్నారు. సో అలా చేయడం వల్ల సినిమాకు ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉండదు. ఆర్సీ 17 సినిమాను కేవలం చరణ్ తో ఒకే ఏడాదిలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

2026లో బుచ్చి బాబు సినిమా పూర్తై రిలీజ్ అయితే 2027 ఎండింగ్ కల్లా సుకుమార్ సినిమా కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఐతే చరణ్ సినిమా పూర్తి చేసి సుకుమార్ పుష్ప 3 సినిమా కూడా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. మైత్రి నిర్మాత రవి శంకర్ పుష్ప 3 2028 లో ఉంటుందని సరదాగా చెప్పే ఛాన్స్ ఉండదు. ఆయనకు సుకుమార్ సినిమాల ప్లానింగ్ పై క్లారిటీ ఉంది కాబట్టే అలా చెప్పి ఉండొచ్చని అంటున్నారు.

ఇంతకీ ఆర్సీ 17 నిజంగానే వన్ ఇయర్ లో పూర్తి చేసే ఛాన్స్ ఉంటుందా.. చరణ్ అంత త్వరగా సినిమా పూర్తి చేస్తాడా లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News