ఇండియన్ 2.. ఓటీటీ లోకి జెట్ స్పీడ్ లోనే

స్నేహితుడా నుంచి తాజాగా ఇండియన్ 2 వరకు శంకర్ చేసిన నాలుగు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి.

Update: 2024-07-22 11:45 GMT

లెజెండరీ డైరెక్టర్ గా సౌత్ లో తనకంటూ బ్రాండ్ చేసుకున్న వ్యక్తి శంకర్. రాజమౌళి కంటే ముందుగానే పాన్ ఇండియా సినిమాలు చేసి శంకర్ సక్సెస్ లు అందుకున్నారు. ఆయన మొదటి సినిమా జెంటిల్మన్ నుంచి రోబో వరకు కెరియర్ లో వరుస సక్సెస్ లు అందుకున్న శంకర్ ఆ తర్వాత మాత్రం ఫ్లాప్ లని ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. స్నేహితుడా నుంచి తాజాగా ఇండియన్ 2 వరకు శంకర్ చేసిన నాలుగు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి.

అయితే ఇండియన్ 2 సినిమా మీద వచ్చినంత నెగిటివిటీ మిగిలిన సినిమాలపై రాలేదని చెప్పాలి. 2.ఓ, ఐ సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయిన కూడా కంటెంట్ పరంగా చాలా మందికి కనెక్ట్ అయ్యింది. ఇప్పటికి ఆ సినిమాలు ఇష్టంగా చూసే ఆడియన్స్ ఉన్నారు. అయితే ఇండియన్ 2 మూవీ మాత్రం ఏ పాయింట్ కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు.

సూపర్ హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా వచ్చిన కూడా ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. దీనికి కారణంగా ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో లేకపోవడమే అని చెప్పాలి. ఇండియన్ 2 మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమాని 6 నుంచి 8 వరాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా ఒప్పందం చేసారంట.

అయితే మూవీ డిజాస్టర్ కావడంతో థియేటర్స్ లో ఆల్ మోస్ట్ వాష్ అవుట్ అయిపొయింది. నష్టం అయితే భారీగానే కనిపిస్తోంది. దీంతో నిర్మాతలు ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంట. మేగ్జిమమ్ ఆగష్టు 2న ఇండియన్ 2 మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. థియేటర్స్ లో కమర్షియల్ గా ఫెయిల్ అయిన చాలా సినిమాలకి ఓటీటీలో మంచి ఆదరణ వస్తోంది. అలాగే ఇండియన్ 2కి కూడా వస్తుందని భావిస్తున్నారు.

మరో వైపు ఇండియన్ 2 రిలీజ్ అయిన ఆరు నెలల్లోనే ఇండియన్ 3 మూవీ థియేటర్స్ లోకి వస్తుందని శంకర్ చెప్పారు. ప్రస్తుతం ఇండియన్ 2 డిజాస్టర్ ఇంపాక్ట్ 3పైన కూడా పడేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ తో సక్సెస్ అందుకొని వచ్చే ఏడాది ఇండియన్ 3 సినిమాని రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఫ్రెష్ మూడ్ తో చూస్తారని అనుకుంటున్నారు.

Tags:    

Similar News