'ఇండియన్ 2'.. ఇదే మంచి ఛాన్స్!
భారతీయుడు అప్పట్లో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కమల్ చేస్తున్న సినిమాల్లో 'ఇండియన్2' కూడా ఒకటి. కమల్ హాసన్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. భారతీయుడు అప్పట్లో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అప్పట్లోనే ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ సాధించి కొత్త రికార్డులు నెలకొల్పింది. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'ఇండియన్ 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఎంతోకాలంగా షూటింగ్ జరుగుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. 'ఇండియన్ 2' పనులు చివరి దశలో ఉన్నట్లు సమాచారం.
కాగా ఏప్రిల్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సేమ్ అదే టైంలో సూర్య భారీ నాన్ ఇండియా మూవీ 'కంగువా' రిలీజ్ ని కూడా ప్లాన్ చేశారు. కానీ తాజా పరిణామాల తర్వాత సూర్య 'కంగువా' మూవీ రిలీజ్ వాయిదా పడింది. దాంతో అది కాస్త 'ఇండియన్ 2' మూవీకి ప్లస్ అయ్యింది. కంగువ సినిమాని సమ్మర్ లో విడుదల చేయడం లేదని నిర్మాత స్వయంగా తెలిపారు. ఈ ఏడాది చివర్లో సినిమాని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇండియన్ 2 మూవీకి సాలీడ్ రిలీజ్ డేట్ దొరికింది. ఏప్రిల్ నెలలో కోలీవుడ్ నుంచి విజయ్, రజినీకాంత్, అజిత్ లాంటి ఇతర స్టార్ హీరోల సినిమాలేవి రిలీజ్ కి లేవు. దాంతో 'ఇండియన్ 2' ఏప్రిల్ లో సోలోగా బరిలోకి దిగబోతోంది. ఇక తెలుగులోనూ 'దేవర' వాయిదా పడడంతో 'ఇండియన్ 2' కి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరికే అవకాశం ఉంది.
ఏప్రిల్ లో తెలుగులోనూ పెద్దగా రిలీజ్ లు లేవు, టిల్లు స్క్వైర్ - ఫ్యామిలీ మ్యాన్ ఉన్నా కూడా 'ఇండియన్ 2' కి పెద్దగా ఎఫెక్ఫ్ ఏమి పడదు. ఇక బాలీవుడ్ విషయానికొస్తే, ఏప్రిల్ నెలలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ సినిమాలు రంజాన్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాయి. అయినా కూడా 'ఇండియన్ 2' కి హిందీలోనూ సరిపడా థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది. అందుకే మళ్ళీ వాయిదా అనకుండా సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేసుకుంటే చాలా బెటర్.