ఓవర్సీస్ లో ఆధిపత్యం మొత్తం వాళ్లదే!

ఇండియన్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అక్కడ భారీ కలెక్షన్స్ ని మన సినిమాలు కొల్లగొడుతూ ఉంటాయి.

Update: 2023-11-01 04:01 GMT

ఇండియన్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అక్కడ భారీ కలెక్షన్స్ ని మన సినిమాలు కొల్లగొడుతూ ఉంటాయి. అత్యధికంగా ఓవర్సీస్ లో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలకి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ ఏడాది తెలుగు సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు.

కాని తమిళ్ సినిమాకి మాత్రం మంచి ఆదరణ లభించింది. ఓ విధంగా చెప్పాలంటే సౌత్ డామినేషన్ ఓవర్సీస్ మార్కెట్ లో ఈ ఏడాది కూడా కనిపించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో చూసుకుంటే పఠాన్, జవాన్ మొదటి రెండు స్థానాలలో ఉంటాయి. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్లకి పైగా వసూళ్లు సాధించాయి.

అలాగే పఠాన్ ఓవర్సీస్ లో 49.45 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి టాప్ ప్లేస్ లో ఉంది. జవాన్ మూవీ 50 రోజుల్లో 48.25 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన స్టార్ క్యాస్టింగ్ కోలీవుడ్ కి చెందినవారే కావడం విశేషం. ఇక మూడో స్థానంలో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ ఉంది.

ఈ సినిమా ఏకంగా 23.3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. దీని తర్వాత రణవీర్ సింగ్, అలియా భట్ కాంబో లో వచ్చిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీ 21 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. టాప్ లో ఇళయదళపతి లియో మూవీ నిలిచింది. ఈ మూవీ ఇప్పటి వరకు 20 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ సాధించింది.

ఓ విధంగా చూసుకుంటే జైలర్ తో కలుపుకొని మూడు కోలీవుడ్ సినిమాలు ఈ సారి ఓవర్సీస్ మార్కెట్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ కి సాధించాయి. అయితే టాలీవుడ్ లో ఈ ఏడాది చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు అయితే ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. డిసెంబర్ లో రాబోయే సలార్ మూవీ ఈ రికార్డులని బ్రేక్ చేసి టాప్ గ్రాసర్ గా మారే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.



Tags:    

Similar News