తమన్నా ఆశలు అవిరైనట్లేనా?
నీరజ్ పాండే తెరకెక్కిన చిత్రంలో తమన్నాతో పాటు అవినాష్ తివారీ, జిమ్మీ షేర్ గిల్ ప్రధాన పాత్రలు పోషించారు.
మిల్కీబ్యూటీ తమన్నా నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో 'స్త్రీ-2', 'వేద'లో ఐటం పాటలో ఓ రేంజ్ లో అలరించింది. 'స్త్రీ 2' విజయంతో తమన్నా సౌండింగ్ బాగానే చేసింది. కానీ 'వేద' మాత్రం నిరుత్సాహ పరిచింది. తాజాగా నిన్నటి రోజు 'సికిందర్ కా ముకద్ద్' తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నీరజ్ పాండే తెరకెక్కిన చిత్రంలో తమన్నాతో పాటు అవినాష్ తివారీ, జిమ్మీ షేర్ గిల్ ప్రధాన పాత్రలు పోషించారు.
టైటిల్ తోనే ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. అమితాబచ్చన్ బ్లాక్ బస్టర్ టైటిల్ నే రివర్స్ చేసి పెట్టడం ప్రచారానికి బాగా కలిసొచ్చింది. ఇక తమన్నా రిలీజ్ సమయంలో సినిమాపై ఎంతో కాన్పిడెంట్ గా కనిపించింది. కెరీర్ లో తొలిసారి ఓ కొత్త పాత్ర పోషించానంటూ ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చింది. కానీ సికిందర్ ఆ అంచనాలు అందుకునేలా కనిపించలేదు. ఖరీదైన డైమండ్ ఎగ్జిబిషన్ లో వందల కోట్ల విలువ చేసే నాలుగు ఎర్ర వజ్రాలు దొంగతనం చేయబడతాయి.
అనుమానితుల్లో కామిని సింగ్ (తమన్నా) ఉంటుంది. కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన జస్విందర్ సింగ్ (జిమ్మీ షెర్గిల్) కు దీన్ని ఎలా ఛేదిస్తాడనేది అసలు స్టోరీ. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా? కథని నడిపించడంలో ఆసక్తి కనిపించలేదు. ల్యాగ్ ఎక్కువగా ఉంది. నీరజ్ పాండే అంటే స్క్రీన్ ప్లే ఎంతో బిగువుగా ఉంటుంది. కానీ సికిందర్ విషయంలో అది ఫెయిలైంది. కొన్ని సన్నివేశాల్లో తన మార్క్ కనిపించినా చాలా చోట్ల విసుగు తెప్పించే సన్నివేశాలే ఎక్కువ.
సరైన లాజికులు లేకుండానే కథని నడిపించాడు. పాత్రలు పరిపూర్ణంగా పండలేదు. తమన్నా, జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారి పెర్ఫార్మన్స్ పరంగా తమ వంతు ప్రయత్నం చేసారు. కానీ లోపాలు వాళ్ల నటనని సైతం కిల్ చేస్తుంది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది.