'డాకు మహారాజ్' ట్రైలర్‌లోనూ అదే సస్పెన్స్...!
సోషల్ మీడియాలో డాకు మహారాజ్ సినిమా గురించి రెగ్యులర్‌గా జరుగుతున్న ప్రచారం సినిమాపై మరింతగా ఆసక్తి పెంచుతున్న విషయం తెల్సిందే.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'డాకు మహారాజ్' సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఒక వైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయినా డాకు మహారాజ్ సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యి మంచి బిజినెస్ జరిగింది. సినిమా మంచి వసూళ్లు సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో డాకు మహారాజ్ సినిమా గురించి రెగ్యులర్‌గా జరుగుతున్న ప్రచారం సినిమాపై మరింతగా ఆసక్తి పెంచుతున్న విషయం తెల్సిందే.
డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణతో పాటు ఒక యంగ్ హీరో కనిపించబోతున్నాడు. బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో పాటు రవితేజ కనిపించిన విషయం తెల్సిందే. వారి కాంబో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ సినిమాలోనే బాబీ ఒక యంగ్ హీరోను స్పెషల్ గెస్ట్‌ను తీసుకు వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ యంగ్ హీరో ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు. సినిమా ట్రైలర్‌లో ఆ విషయాన్ని రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా వచ్చిన డాకు మహారాజ్ ట్రైలర్‌లో ఆ విషయాన్ని రివీల్ చేయలేదు. దాంతో అసలు విషయం ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరో సినిమాలో యంగ్ హీరో కనిపిస్తే కచ్చితంగా అది స్పెషల్‌గా అంతా చూస్తారు. కానీ సినిమాలో ఆ హీరో ఎవరు అనే విషయాన్ని చెప్తే మరింతగా పబ్లిసిటీ దక్కి సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ హీరో ఎవరు అనే విషయమై రకరకాలుగా ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయం గురించి ఒక స్పష్టత రాకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల అయ్యే వరకు ఆ విషయం గురించి బయటకు చెప్పకుండా ఉండాలని బాబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఆ విషయం గురించి రివీల్ కాకుండా చూసుకోవడం గొప్ప విషయం. ఈమధ్య కాలంలో పెరిగిన సోషల్ మీడియా పరిధి కారణంగా ఏ చిన్న విషయాన్ని దాచాలి అన్నా చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా కొన్ని సస్పెన్స్‌లను సర్‌ప్రైజ్‌లను దాచాలి అంటే చాలా పెద్ద టాస్క్‌గా మారింది. అయినా డాకు మహారాజ్ సినిమాలోని ఆ యంగ్ హీరో ఎవరు అనే విషయాన్ని బయటకు తెలియకుండా దర్శకుడు బాబీ చాలా జాగ్రత్త పడటం అభినందనీయం. సినిమా విడుదల రోజు మాత్రం ఆ విషయం రివీల్ కావడం, అతడి పాత్ర గురించి అంతా సోషల్ మీడియా ద్వారా వార్తలు రావడం ద్వారా అంతా తెలుసుకోనున్నారు.