పుష్ప 2 మళ్ళీ వాయిదా.. ఓ క్లారిటీ ఇచ్చేశారు
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’పైన దేశ వ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది. కచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు సంచలన రికార్డులు సృష్టిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని మొదటి రోజు ‘పుష్ప 2’ వసూళ్లు చేస్తుందని ట్రేడ్ పండితులు కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ మూవీలోని ఐటెం సాంగ్ రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఐటెం సాంగ్ లో శ్రీలీల డాన్స్ చేసింది. కచ్చితంగా ఈ సాంగ్ ‘పుష్ప’లోని ఊ అంటావా తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన ఇంకా పెండింగ్ వర్క్ ఉందని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసే పనిలో ఉన్నారంట. రెండు, మూడు యూనిట్స్ గా విడిపోయి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే నవంబర్ 27, 28 నాటికి షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యే ఛాన్స్ ఉందంట. ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వీలైనంత ఎర్లీగా పూర్తి చేయాలి. అప్పటికి ఇంకా మూవీ రిలీజ్ కి వారం రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అయితే ఆ వారం రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధం కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకే రిలీజ్ డేట్ ని మార్చే అవకాశం ఉందని మరొక టాక్ విన్పిస్తోంది. నెక్స్ట్ వీక్ కి రిలీజ్ షెడ్యూల్ చేయొచ్చనే టాక్ నడుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ఈ ప్రచారం విస్తృతంగా జరగడంతో పుష్ప టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. ట్విట్టర్ లో పుష్ప అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక జిఫ్ వీడియో రిలీజ్ చేసి డిసెంబర్ 5న రిలీజ్. తగ్గేదిలే.. అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం కోసం టీమ్ మొత్తం కష్టపడుతోందని తెలుస్తోంది. సుకుమార్ పూర్తిస్థాయిలో మూవీ అవుట్ ఫుట్ పైన ఫోకస్ చేసాడంట.
అలాగే టెక్నీకల్ టీమ్ మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ మూవీ ప్రమోషనల్ బాధ్యతలు అన్ని తీసుకున్నాడు. దగ్గరుండి ఈ సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఐటెం సాంగ్ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరగనుంది. ఈ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేస్తాడు.