మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ టార్గెట్ ఇదే

అయిన కూడా మాస్ మహారాజ్ సినిమాలకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

Update: 2024-08-14 04:28 GMT

మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కలయికలో మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తోన్న మూవీ మిస్టర్ బచ్చన్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించారు. ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ నుంచి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాలు ప్రేక్షకులని మెప్పించడంలో ఫెయిల్ అయ్యాయి.

అయిన కూడా మాస్ మహారాజ్ సినిమాలకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ బాగుందనిపిస్తే డిస్టిబ్యూటర్స్ ఎగబడి ఆ మూవీ థీయాట్రికల్ రైట్స్ కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ సినిమాపైనే కూడా భారీగానే బిజినెస్ జరిగింది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో పాటు ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఆగష్టు 15న ఈ చిత్రంలో థియేటర్స్ లోకి రాబోతోంది.

ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ మూవీ బిజినెస్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. నైజాంలో 11.50 కోట్ల బిజినెస్ ఈ సినిమాపై జరిగింది. సీడెడ్ లో 4 కోట్లకి రైట్స్ అమ్ముడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 11.50 కోట్లకి రైట్స్ ని డిస్టిబ్యూటర్స్ కొన్నారు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 28 కోట్ల లెక్క కనిపిస్తోంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్లకి మూవీ థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో 2 కోట్లకి మిస్టర్ బచ్చన్ రైట్స్ సోల్డ్ అయ్యాయి.

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 31 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ మిస్టర్ బచ్చన్ చిత్రంపై జరిగింది. 32 కోట్ల షేర్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సాధిస్తుంది. మూవీపైన పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకి నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ కొడతామని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ బ్యూటీ సాంగ్స్ లో తన అందచందాలతో ఆకట్టుకోవడంతో యూత్ నుంచి సినిమాకి ఎక్కువ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

నైజాం - 11.50 కోట్లు

సీడెడ్ - 4 కోట్లు

ఆంధ్రప్రదేశ్ -: 11.50 కోట్లు

ఏపీ, తెలంగాణ టోటల్ - 28 కోట్లు

కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా - 2 కోట్లు

ఓవర్సీస్ - 2 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ - 31.00కోట్లు

బ్రేక్ ఈవెన్ టార్గెట్ -32 కోట్లు

Tags:    

Similar News