చిరు-పవన్ మధ్య చరణ్ నలిగిపోతున్నాడా?
రిలీజ్ అవ్వాల్సినప్పుడు అదే రిలీజ్ అవుతుంది..అప్పుడు చూసుకుందా దాని సంగతి అనేవరకూ సీన్ వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య అబ్బాయ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నలిగిపో తున్నాడా? అందుకు ప్రధాన కారకుడు దర్శకడు శంకర్? అంటే అవుననే తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో 'గేమ్ ఛేంజర్' ఎంత కాలంగా ఆన్ సెట్స్ లో మూలుగుతోందో తెలిసిందే. 2021 లోప్రారంభమైన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. చివరికి చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా విసుగుపోయాడు.
రిలీజ్ అవ్వాల్సినప్పుడు అదే రిలీజ్ అవుతుంది..అప్పుడు చూసుకుందా దాని సంగతి అనేవరకూ సీన్ వచ్చేసింది. అయినా రిలీజ్ అవుతుందనే ఓ ఆశ అందరికీ ఉంటుందిగా. ఇప్పుడా ఆశ కారణంగానే మధ్యలో చరణ్ నలిగిపోతున్నాడు. ఒకవేళ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ రిలీజ్ అయితే సెప్టెంబర్ లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే అదే సమయానికి పీకే 'ఓజీ 'కూడా రిలీజ్ అవుతుంది.
ఆ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు ఇది కన్పమ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ నెలలో గేమ్ ఛేంజర్ రిలీజ్ అన్నది పెట్టుకునే ఛాన్సులు చాలా తక్కువగానే కనిపిస్తు న్నాయి. ఇక సెప్టెంబర్ మిస్ అయితే గనుక వెంటనే దసరా దూసుకొస్తుంది. సెలవుల సీజన్ కాబట్టి రిలీజ్ కి అనువైనదే. కానీ ఒకవేళ అనివార్య కారణాలతో రాలేకోపోతే గనుక మళ్లీ 2025 సమ్మర్ వరకూ చరణ్ ఆగాల్సిందే.
డిసెంబర్ ఆప్షన్ ఉన్నా 'పుష్ప-2' ఆగస్టు నుంచి డిసెంబర్ కి వాయిదా పడితే గనుక చరణ్ అప్పుడు రావడం కరెక్ట్ కాదు. ఇక సంక్రాంతికి ఛాన్సే లేదు. ఎందుకంటే చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభర' 2025 సంక్రాంతికి అని ముందే ప్రకటించేసారు కాబట్టి ఆ సీజన్ వైపు చరణ్ చూసే ఛాన్స్ కూడా లేదు. ఆ తర్వాత మళ్లీ సమ్మర్ వరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే 'గేమ్ ఛేంజర్' విషయంలో ఈ గేమ్ కి పుల్ స్టాప్ పడాలంటే శంకర్ రిలీజ్ తేదీపై ఓ క్లారిటీ ఇస్తే తప్ప చరణ్ పై దంపుడు తగ్గే అవకాశం ఉంటుంది.