దీపిక‌లో భ‌యాలు ఇన్‌సెక్యూరిటీకి కార‌ణం?

అయితే హాలీవుడ్‌లో తన స్పేస్‌ను సృష్టించుకున్న ప్రియాంక చోప్రాలా కాకుండా దీపిక ఇండియా నా ఇల్లు అంటూ దేశంలోనే ఉండిపోయింది.

Update: 2023-11-15 03:45 GMT

బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ దీపికా పదుకొణె 2007లో తన తొలి చిత్రం `ఓం శాంతి ఓం` విడుదలై భారీ విజయం సాధించినప్పటి నుంచి హిందీ చిత్ర పరిశ్రమలో విజయవంతంగా రాణిస్తోంది. హాలీవుడ్ నుంచి కోకొల్ల‌లుగా ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే హాలీవుడ్‌లో తన స్పేస్‌ను సృష్టించుకున్న ప్రియాంక చోప్రాలా కాకుండా దీపిక ఇండియా నా ఇల్లు అంటూ దేశంలోనే ఉండిపోయింది.

ప్ర‌ఖ్యాత `వోగ్‌`కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో దీపిక తన మోడలింగ్ రోజుల్లో తాను పారిస్ - మిలన్‌లో ఉన్నానని అక్కడికి వెళ్లి సెటిల‌వ్వాలని అనుకున్న‌ట్టు చెప్పింది. నా మోడలింగ్ కెరీర్ ప్రారంభంలో నాకు విదేశాలకు వెళ్లేందుకు ఆఫర్ వచ్చింది. భారతదేశంలోని ఫ్యాషన్ గురువులంతా ``మీరు ఇక్కడ ఉండకూడదు.. పారిస్, న్యూయార్క్ లేదా మిలన్‌లో ఉండాలి`` అని అన్నారు. ``నేను ఇలా ఉన్నాను. ..అవేవీ నా చోటు కాదు. నా ఇల్లు కాదు.. భారతదేశం నా ఇల్లు`` అని ఇక్క‌డే ఉండిపోయాను అని తెలిపింది. నేటికీ అవ‌కాశాలొచ్చినా పాశ్చాత్య దేశాల‌కు వెళ్లే ఆలోచ‌న లేద‌ని కూడా దీపిక తెలిపింది. 2017 హాలీవుడ్ యాక్షన్-థ్రిల్లర్ XXX: రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్‌లో నటించిన దీపిక ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని చూపడానికి నేను బ్యాగ్ సామాను స‌ర్ధుకుని ఎందుకు వెళ్లాలి? అని కూడా ప్ర‌శ్నించింది.

పఠాన్- జవాన్ అనే రెండు సూపర్‌హిట్‌లలో న‌టించిన దీపికకు 2023 విజయవంతమైన సంవత్సరం. రెండు సినిమాలు రూ.1000 కోట్లకు పైగా వ‌సూల్ చేశాయి. పద్మావత్, బాజీరావ్ మస్తానీ, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్, యే జవానీ హై దీవానీ వంటి చిత్రాలతో అత్యంత ప్రామిస్సింగ్ న‌టీమ‌ణిగా పాపుల‌రైన దీపిక‌.. ఇప్పుడు నెపోటిజం గురించి ఓపెనైంది. స్టార్ కిడ్స్‌కు అనుకూలంగా ఉండే పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభంలో కష్టాలను ఎదుర్కొన్నాన‌ని కూడా తెలిపారు.

ప‌రిశ్ర‌మ ఇన్ సైడ్ వ్యక్తుల అభద్రతాభావాలతో తాను ఎలా వ్యవహరించిందో కూడా తెలిపింది. ``నాకు వేరే మార్గం లేదు`` అని చాలా సింపుల్ గా దీపిక బదులిచ్చారు. 15 లేదా 20 సంవత్సరాల క్రితం బయటి వ్యక్తిగా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన‌ప్పుడు వేరే మార్గం లేనేలేదు. తల్లిదండ్రులు లేని రంగంలో లేదా వృత్తిలో త‌న‌దైన ముద్ర వేయడానికి ప్రయత్నించే ఏ వ్యక్తికైనా ఇది ఒక అంద‌నంత ఎత్తైన‌ పని. మేము బంధుప్రీతి వంటి వాటిని స్పష్టంగా చెప్పడం ప్రారంభించాం. ఇది కొత్త ధోరణి. ఇది అప్పుడు ఉంది.. ఇప్పుడు ఉంది. ఇది ఉనికిలో ఉంటుంది. అది వాస్తవం అని కూడా దీపిక వ్యాఖ్యానించింది.

కానీ దీపిక‌ తన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరూ లేకుండా కొత్త నగరం(ముంబై)లో ఉన్నప్ప‌టి తన కథను వివరించింది. కష్టాల మధ్య విజయం సాధించినందుకు దీపిక‌ తనను తాను అభినందించుకుంది. ``అప్పట్లో నాకు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా సంగ‌తులే ఉన్నాయి. నేను కొత్త పరిశ్రమలో కుటుంబం లేదా స్నేహితులు లేకుండా కొత్త నగరానికి వెళ్లాను. అప్ప‌టికి యుక్తవయస్సులో ఉన్నాను. నేను నా భోజనం రవాణా వ్య‌వ‌హారాల‌ను డీల్ చేయాలి. నా బ్యాగులు నేనే మోయాలి. నేనెప్పుడూ దాన్ని భారంగా భావించలేదు`` అని కూడా తెలిపింది.

ఆ రోజుల్లో త‌న‌ తల్లి క్షేమం త‌న‌ గురించి ఆందోళన చెందార‌ని కూడా దీపిక తెలిపారు. కానీ ఆ రోజులను త‌ర‌చి చూసుకున్న‌ప్పుడు చెడు కాదు.. నువ్వు దీన్ని సాధించి చూపించావు.. సొంతంగా సాధించావు అని త‌న త‌ల్లి ప్రోత్స‌హించేవార‌ని దీపిక తెలిపింది. జవాన్ - పఠాన్ విజయాల తర్వాత దీపికా పదుకొణె హృతిక్ రోషన్ - అనిల్ కపూర్‌లతో చేసిన `ఫైటర్` విడుద‌ల‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రం 2024 రిపబ్లిక్ డే రోజున విడుదల కానుంది.

Tags:    

Similar News