త‌మిళ బ్యూటీని త‌ల‌పించిన‌ అంబానీ ఇంట బ్యూటీ!

అంబానీ ఇంట పెళ్లి ఏ రేంజ్ లో జ‌రుగుతుందో క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

Update: 2024-07-11 11:22 GMT

అంబానీ ఇంట పెళ్లి ఏ రేంజ్ లో జ‌రుగుతుందో క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. గ‌త వారం రోజులుగా ముంబైలో పండ‌గా వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. అనంత్ -రాధికా మ‌ర్చంట్ వివాహ ఘ‌ట్టాన్ని అంబానీ కుటుంబ స‌భ్యులు ఎంతగా ఆస్వాదిస్తున్నారు? అన్న‌ది సోష‌ల్ మీడియాలో చూస్తే తెలిసిపోతుంది. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ సైతం 1980 డేస్ లోకి వెళ్లిపోయి ఆట‌పాట అందుకున్నారు.


కుమారులు, మ‌న‌వ‌రాళ్ల‌తో క‌లిసి ఆనాటీ మ్యూజిక్ కి నేటి మ్యాజిక్ ని క్రియేట్ చేసి వావ్ అనిపించారు. డాన్సులు సినిమా వాళ్లే కాదు..మేము కూడా చేస్తామ‌ని నిరూపించారు. ఇక వివాహానికి ఇంకా కొన్ని గంట‌లే స‌మ‌యం ఉండ‌టంతో? కుటుంబ స‌భ్యులంతా సాంప్ర‌దాయ వేడుక‌ల్లో ట్రెడీష‌న‌ల్ అటైర్స్ తో అల‌రి స్తున్నారు. దీనిలో భాగంగా ముకేష్ అంబానీ -నీతా అంబానీ ముద్దుల కుమార్తె ఇషా అంబానీ తమిళనాడు బ్రైడల్ స్టైల్లో మెరిసారు.


పింక్ బార్డర్, గోల్డెన్ బ్లౌజ్‏తో టీల్ రా సిల్క్ లెహంగా లో ఇషా క‌ళ‌క‌ళ‌లాడిపోతున్నారు. గ్రీన్ క‌ల‌ర్ బ్యూటీతో డిజైన్ చేసిన బంగారు హారం ఇసా మెడ‌కే వ‌న్నే తీసుకొచ్చింది. దానిపైన డ్రెస్ ని మ్యాచ్ చేస్తూ మ‌రో హారం ధరించారు. ఈ రెండు ఆమెని అందాన్ని మ‌రింత రెట్టింపు చేసాయి. అన్నింటిని మించి ఇషా హెయిర్ స్టైల్ మాత్రం అద్భుతం అనిపిస్తుంది. పువ్వుల మొగ్గ‌ల‌తో కొప్పువేసి బ్రెయిడ్ మొత్తం గోల్డ్ థ్రెడ్ వర్క్ చేశారు.


చివర్లో జడ కుచ్చిళ్లు బంగారు సూర్యచంద్రుడిలా హైలెట్ చేశారు. ఇది త‌మిళ‌నాడు బ్రైడ‌ల్ సాప్ర‌దా యంలో మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఇషా త‌మ్ముడి పెళ్లి కోసం ఇలా ముస్తాబైంది. అలాగే చెవులను గోల్డ్ స్టడ్స్ తో మరింత అందంగా తీర్చిదిద్దింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. పెళ్లికి ముందు కొన్ని గంట‌ల హంగామా ఇలా ఉంది? అంటే పెళ్లి స‌మ‌యంలో ఇషా ఇంకెంత అందంగా ముస్తాబవుతంది? అన్న ఎగ్జైట్ మెంట్ నెటి జ‌నుల్లో మొద‌లైంది.

Tags:    

Similar News