బాబోయ్‌.. వీరమల్లు కూడా అప్పుడేనా?

హరి హర వీరమల్లు సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

Update: 2024-05-29 11:57 GMT

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన హరి హర వీరమల్లు సినిమా వివిధ కారణాల వల్ల ఇప్పటికి కూడా పూర్తి అవ్వలేదు. దాదాపుగా రెండేళ్ల నుంచి నాన్చుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది విడుదల చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు.

హరి హర వీరమల్లు సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాకుండా సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్‌ తప్పుకోవడం, మిగిలిన బ్యాలన్స్‌ షూటింగ్‌ ను జ్యోతి కృష్ణ పూర్తి చేయబోతుండటం కూడా అందరికీ తెలిసిందే.

ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యాయి. కనుక జూన్‌ లేదా జులై నుంచి పవన్‌ షూటింగ్స్ కు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక వీరమల్లు సినిమా షూటింగ్‌ ను వెంటనే పూర్తి చేసి సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా నిర్మాత రత్నం తాజా చిట్‌ చాట్ లో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇప్పటికే ఈ ఏడాది అక్టోబర్‌ లో దేవర సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 10 అంటూ అధికారికంగా డేట్‌ ను ఇవ్వడం జరిగింది. తాజాగా గేమ్‌ చేంజర్ సినిమా ను కూడా అక్టోబర్‌ లో విడుదల చేసే అవకాశం ఉందని నిర్మాత దిల్‌ రాజు కూతురు స్వయంగా చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ తో ప్రస్తుతం బాబీ రూపొందిస్తున్న సినిమాను కూడా అక్టోబర్‌ లోనే విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇన్ని సినిమాలు ఉండగా అదే అక్టోబర్‌ 2024 న హరి హర వీరమల్లు రావడం సాధ్యమేనా అనేది చూడాలి.

Tags:    

Similar News