పిక్ టాక్ : గుండె జారి గల్లంతయ్యేంత అందం

సోషల్‌ మీడియా ద్వారా ఈమె షేర్‌ చేసే పోటోలు మరియు వీడియో లు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Update: 2023-12-27 10:17 GMT

నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఇషా తల్వార్‌. ఈ అమ్మడు బాలీవుడ్‌ దర్శక నిర్మాత అయిన వినోద్ తల్వార్ కుమార్తె. ఈమె మలయాళ చిత్రం తట్టతిన్‌ మరయత్తుతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.


అందాల ప్రదర్శన విషయంలో ఈ అమ్మడిది ప్రత్యేక శైలి అంటూ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చెబుతూ ఉంటారు. సోషల్‌ మీడియా ద్వారా ఈమె షేర్‌ చేసే పోటోలు మరియు వీడియో లు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె ఫోటోలు వైరల్‌ అయ్యాయి.


బ్లాక్ అండ్‌ ఫోటో ను షేర్‌ చేసిన ఇషా తల్వార్‌ ఆకట్టుకునే అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. క్యూట్‌ అందంతో పాటు ఆకట్టుకునే ఫిజిక్‌ తో ఈ అమ్మడు ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇంత అందంగా ఉన్నా కూడా ఇషా తల్వార్‌ కి అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు ఎప్పుడు కూడా వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఈసారి కూడా ఈమె ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Tags:    

Similar News