రానా, అనిరుద్.. ఏదో ప్లాన్ చేస్తున్నారే..

ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-08-13 09:38 GMT

టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా యాక్టర్ గా దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు, తమిళ్, హిందీ, మలయాళీ భాషలలో కూడా రానా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రానా ఎస్టాబ్లిష్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. తమిళంలోకి కూడా ఆరంభం మూవీతో రానా అడుగుపెట్టాడు. అప్పటి నుంచి రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే తాజాగా దగ్గుబాటి రానా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ కలిసి దిగిన ఫోటో ట్విట్టర్ లో వైరల్ అయ్యింది. మాజీ UFC ఫైటర్ ఆంథోని పెట్టీస్ ఈ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ ముగ్గురు కలిసి ఓ గ్లోబల్ వెంచర్ ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నారంట. ఆంథోని పెట్టీస్ స్పోర్ట్స్ ఈవెంట్ కోసం రానా, అనిరుద్ అగ్రిమెంట్ చేసారంట. అందులో భాగంగానే ఆగష్టు 12న వారు మెక్సికోలో ఆంథోని పెట్టీస్ ని కలిశారంట. ఈ సందర్భంగా వారు కలిసి దిగిన ఫోటోని అంథోని ట్విట్టర్ లో పెట్టారు. వీరి కలయికలో ఎం ప్లాన్ జరిగిందనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

స్పోర్ట్స్ ఈవెంట్ కోసమే మీట్ అయ్యారనే ప్రచారం మాత్రం జరుగుతోంది. ఈ ఈవెంట్ లో రానా, అనిరుద్ పాత్ర ఏంటనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. త్వరలో దీనిపై స్పష్టత రావొచ్చు. ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి, అనిరుద్ హర్ష వడ్లమూడితో కలిసి కొత్త టేకిలా బ్రాండ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారంట. అనిరుద్, రానా మధ్య మొదటి నుంచి మంచి బాండింగ్ ఉంది. ఇదే బాండింగ్ ఇప్పటికి కొనసాగుతోంది.

ప్రస్తుతం అనిరుద్ రవిచందర్ తెలుగులో దేవర సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ మూవీకి కూడా అతనే మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ చేయబోయే సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందించనున్నారు.

Tags:    

Similar News