ఎన్నిసార్లు విడిపోతారు? ఇంకెన్నిసార్లు క‌లుస్తారు?

మ‌ళ్లీ చివ‌రిగా ఆ పాత జోడీనే మ‌ళ్లీ నాలుగేళ్ల క్రితం ప్రేమ అంటూ మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌య్యారు.

Update: 2024-06-29 14:30 GMT

హాలీవుడ్ జోడీ జెన్నీఫ‌ర్ లోపేజ్-బెన్ అప్లెక్ డేటింగ్..మ్యారేజ్ ముచ్చ‌ట తెలిసిందే. తొలిసారి 2002 లో మొద‌లై 2004 వ‌ర‌కూ ప్రేమించుకున్నారు. క‌లిసి కాపురం చేసారు. ఆ త‌ర్వాత కొంత కాలానికి బంధం చీలిపోయింది. దీంతో బ్రేక‌ప్ త‌ప్ప‌లేదు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు వేరే వాళ్ల‌తో డేటింగ్ లు చేసారు. వాళ్ల‌తోనూ విడిపోయారు. మ‌ళ్లీ చివ‌రిగా ఆ పాత జోడీనే మ‌ళ్లీ నాలుగేళ్ల క్రితం ప్రేమ అంటూ మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌య్యారు.

2022 లో పెళ్లి చేసుకున్నారు. మొద‌టి సారి డేటింగ్ కే ప‌రిమిత‌మైన రెండ‌వ‌సారి మాత్రం డేటింగ్ తో పాటు పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో ఇద్ద‌రు క‌ల‌కాలం క‌లిసి ఉండ‌టం ఖామ‌నుకున్నారంతా. ప్రేమ అనే ప్ర‌యాణంలో ఇద్ద‌రికీ చ‌రిత్ర మ‌రువ‌ని ఎన్నో జ్ఞాప‌కాలు ఉండ‌టంతో ఈసారి విడిపోరు అని అంతా అనుకున్నారు. కానీ కొన్నాళ్ల‌కే మళ్లీ విడిపోతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి.ఆ సంఘ‌ట‌న ఈ మ‌ధ్య‌నే చోటు చేసుకుంది.

విడిపోవ‌డం , క‌ల‌వ‌డం అల‌వాటైన జోడీ గురించి పెద్ద‌గా హైలైట్ కాలేదు. అయితే చివ‌రికి మ‌ళ్లీ ఎలాగూ ఇద్ద‌రు రాజీకొచ్చి క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యించుకుని ముందుకు సాగారు. కానీ ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేద‌ని మ‌రోసారి ప్రూవ్ అవుతుంది. జెన్నీఫర్ లోపేజ్- బెన్ అఫ్లెక్ బ్రేకప్ చెప్పుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇటీవల వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఆ విబేధాలు తీవ్ర స్థాయికి చేరుకోవ‌డంతో క‌లిసి ఉండ‌టం అసంభ‌వంగా భావించి విడాకుల‌తో వేర‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారుట‌. ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తున్న బెన్‌కు దూరంగా ఉండటం కూడా వారిద్దరి బ్రేకప్‌కు బలమైన సాక్ష్యంగా క‌నిపిస్తుంది. అయితే ఈ జోడీని అంత తేలిగ్గా న‌మ్మ‌డానికి లేదు. కొన్ని నెల‌ల క్రితం ఇదే తంతు అంత‌ర్జాతీయ మీడియాలో న‌డిచింది. క‌ట్ చేస్తే క‌లిసిపోయారు. మ‌ళ్లీ ఇప్పుడు అలాంటి స‌న్నివేశం చోటు చేసుకుంటుందా? లేక నిజంగానే విడిపోతున్నారా? అన్న‌ది తేలాలి.

Tags:    

Similar News