హోటల్ రూం ఇష్యూ... మిస్ యూనివర్స్ పోటీల నుంచి ఔట్
అయితే ఇప్పటి వరకు అధికారికంగా నిర్వాహకులు మీడియా ముందుకు వచ్చి ఆమె విషయమై స్పందించలేదు.
మిస్ యూనివర్స్ పోటీల్లో పనామాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటలీ మోర గ్రాండ్ ఫినాలేకు కొన్ని రోజుల సమయం ఉండగా పోటీల నుంచి హఠాత్తుగా బహిష్కరణకు గురి అయింది. ఆమెను పోటీల నుంచి నిర్వాహకులు తొలగించడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మిస్ యూనివర్స్ పోటీల నుంచి ఒక కంటెస్టెంట్‌ను హోటల్ రూం ఇష్యూ వల్ల తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ పోటీలను ఫాలో అవుతున్న వారు అంతా ఈ విషయమై షాక్ అవుతున్నారు.
నిర్వాహకులు ఏ కారణం వల్ల ఆమెను తొలగించింది అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆమెను ఈ పోటీల నుంచి తొలగిస్తున్నామని, ఆమె వ్యవహార శైలి సరిగా లేదనే కారణం చూపిస్తూ ఒక నోట్ ను విడుదల చేయడం జరిగిందట. అయితే ఇప్పటి వరకు అధికారికంగా నిర్వాహకులు మీడియా ముందుకు వచ్చి ఆమె విషయమై స్పందించలేదు. మీడియాలో వస్తున్న అనేక రకాల పుకార్ల వల్ల ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అంటూ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రముఖంగా ఆమె బాయ్ ఫ్రెండ్ వల్ల పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కొందరు అంటున్నారు.
మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు ఇటలీ మోరా కు ఇచ్చిన హోటల్ రూమ్ లోకి బయటి వ్యక్తులు ఎవరూ వెళ్ల కూడదు. పర్మీషన్ లేకుండా తన బాయ్ ఫ్రెండ్‌ను హోటల్ రూంకి తీసుకు వచ్చిందట. అతడు కొన్ని గంటల పాటు హోటల్ రూమ్ లో ఉన్నట్లుగా మిస్ యూనివర్స్ పోటీల నిర్వాహకులకు సమాచారం అందడం వల్లే ఆమెను పోటీల నుంచి బహిష్కరించారు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయమై నిర్వాహకులు ఆమెపై చాలా సీరియస్ అయ్యారని, ఆమె నుంచి వచ్చిన సమాధానానికి సంతృప్తి చెందక పోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారట.
ఇటలీ మోరా తన గురించి వస్తున్న వార్తలను ఖండించింది. తన బాయ్ ఫ్రెండ్ హోటల్ రూంకి వచ్చిన విషయాన్ని ఆమె కొట్టి పారేసింది. నిర్వాహకులు కారణం చూపించకుండా తనను బ్యాన్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నిర్వాహకులపై ఇటలీ మోరా మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ ఆరోపణలు చేస్తూ ఉంటే నిర్వాహకులు మాత్రం ఈ విషయమై మౌనంగా ఉంటున్నారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వారి నుంచి అధికారిక ప్రకటన ఉంటుందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఫైనల్ ముందు ఇటలీ మోరా పోటీల నుంచి తప్పుకోవడం ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.