ఫ్యామిలీ ఫిలిం అని ముందు చెప్పలేకపోవడం వలనే!

తాజాగా మీడియా మీట్ లో మాట్లాడుతూ ఈ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని, ఏదో ఊహించుకొని రావడం వలన కొంతమందికి నచ్చలేదు.

Update: 2024-01-19 12:14 GMT

గుంటూరు కారం సినిమా కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ తల్లి, కొడుకుల మధ్య నడిచే కథాంశంతో తెరకెక్కింది. అయితే ఈ మూవీని ముందుగా మేము ఫ్యామిలీ స్టోరీ అని ప్రమోట్ చేయకపోవడం వలన కాస్తా నెగిటివ్ వచ్చిందని అనుకుంటున్న అని నిర్మాత నాగ వంశీ గుంటూరు కారం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మీడియా మీట్ లో మాట్లాడుతూ ఈ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని, ఏదో ఊహించుకొని రావడం వలన కొంతమందికి నచ్చలేదు.

అది మా తప్పు కాదు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ. ఎమోషన్ లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎమోషన్ అంటే మహేష్ బాబు కూర్చొని ఏడవాల్సిన అవసరం లేదని నాగవంశీ అన్నారు. అలాగే కొంత మంది బోట్స్ ద్వారా బుక్ మై షోలి గుంటూరు కారం సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నట్లు గుర్తించామని వాటిపై బుక్ మై షో వారికి కంప్లైంట్ చేశామని తెలిపారు. నెగిటివ్ టాక్ స్పీడ్ చేసేవారిని పట్టుకోవడంలో ఫ్యాన్స్ తమకి చాలా సహకరించారని తెలిపారు.

చిన్న సినిమాల మీద ఎప్పుడు తప్పుడు ప్రచారం జరగదని, పెద్ద సినిమాల మీదనే జరుగుతుందని అన్నారు. అయితే ఆ ప్రచారం ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది మీడియా వారే కనుక్కొని చెప్పాలని సూచించారు. సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యిందని, సూపర్ హిట్ తిలక్ వచ్చిందని ఈ మీడియా సమావేశంలో నాగ వంశీ చెప్పుకొచ్చారు.

అలాగే గుంటూరు కారం సినిమాకి సంబందించి చాలా అంశాలపై మీడియాతో నాగ వంశీ మాట్లాడటం విశేషం. ఆయన లెక్క ప్రకారం ఇప్పటికే గుంటూరు కారం మూవీ 100 కోట్లకి పైగా షేర్ ని వసూళ్లు చేసింది. అలాగే గ్రాస్ పరంగా కూడా 200 కోట్లు దాటేలా ఉంది. మరి ఈ మూవీ ఓవరాల్ కలెక్షన్స్ ఎంత వచ్చాయనేది అఫీషియల్ చిత్ర యూనిట్ ప్రకటించే వరకు తెలియదు.

ఏది ఏమైనా గుంటూరు కారం సినిమాకి సోషల్ మీడియాలో వస్తోన్న నెగిటివ్ రివ్యూలు అన్ని కూడా కేవలం దుష్ప్రచారం మాత్రమే అని, రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం మూవీని అద్భుతంగా ఆదరిస్తున్నారని నాగ వంశీ మీడియా సమావేశం ద్వారా చెప్పినట్లు అయ్యింది.

Tags:    

Similar News