పుష్పతో పెట్టుకోవడం కంటే సైడివ్వడమే బెటర్

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు పై అంచనాలు మామూలుగా లేవు.

Update: 2024-04-12 12:31 GMT

పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ గా రాబోతున్న సినిమాల్లో పుష్ప సెకండ్ పార్ట్ కూడా టాప్ లిస్టులో ఉంది అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు పై అంచనాలు మామూలుగా లేవు. ఫస్ట్ పార్ట్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ ఇప్పుడు రెండవసారి అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవాలి అని అడుగులు వేస్తూ ఉన్నాడు.

బాక్సాఫీస్ వద్ద ఎట్టి పరిస్థితులను వెయ్యి కోట్ల మార్క్ మిస్ కాకూడదనే ఆలోచనతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ ఏ స్థాయిలో రెస్పాన్స్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కాబట్టి తదుపరి అప్డేట్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నట్లు సమాచారం.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అనుకున్నట్లు రావాలి అంటే కంటెంట్ బలంగా ఉండడం మాత్రమే కాదు.. పోటీగా ఇతర సినిమాలు కూడా పెద్దగా ఉండకూడదు. అలాగని పుష్ప 2కి పోటీగా వచ్చే సినిమాలకు ప్రమాదం ఉండకుండా ఉండదు. పుష్పరాజ్ ఏ మాత్రం క్లిక్ అయినా బాలీవుడ్ సినిమాలు సైతం బొక్కబోర్లా పడే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన టీజర్ తోనే పుష్పరాజ్ తాకిడి గట్టిగా ఉండబోతున్నట్లు ఒక సూచనలు అయితే వచ్చాయి.

దీంతో పుష్పరాజ్ కు ఎదురుగా వెళ్లే ధైర్యం ఎవరు చేయకపోవచ్చు అని అర్థమవుతుంది. ఈ సినిమా ఆగస్టు 15 డేట్ కు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే డేట్ కు అజయ్ దేవగన్ రోహిత్ శెట్టి కాంబినేషన్లో రాబోతున్న సింగం ఎగైన్ సినిమా కూడా రావాలని అనుకుంది. అయితే ఇప్పుడు పుష్ప రాజ్ సినిమాకి ఎక్కువ స్థాయిలో డిమాండ్ పెరుగుతోందని వాళ్ళు తప్పుకునేలా కనిపిస్తున్నారు.

కేజీఎఫ్ కంటే అద్భుతమైన ఆఫర్లు మైత్రి మూవీ మేకర్స్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ వీలైనంత ఎక్కువ థియేటర్లో పుష్ప రాజ్ కోసం బ్లాక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక అజయ్ దేవగన్ సినిమాకు కూడా థియేటర్స్ దొరుకుతాయి కానీ ఎక్కువగా పుష్ప 2 హడావిడి ఉంటే మాత్రం ముప్పు తప్పదు. కాబట్టి సినిమాను దీపావళికి వాయిదా వేసుకోవాలని చూస్తున్నారు.

అంతేకాకుండా అజయ్ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ ఉంది. ఎంత స్పీడ్ గా వర్క్ చేసినా కూడా ఆ సమయానికి వచ్చే అవకాశం లేదట. అది కూడా ఒక కారణం. అందుకే సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప 2కి అయితే బాలీవుడ్లో మిగతా ఎవరు కూడా పోటీగా వచ్చే ప్రయత్నం చేయాలని అనుకోవడం లేదు. మరి ఈ అవకాశాన్ని పుష్ప సినిమా సినిమా ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News