రాణీ ముఖర్జీకి సవాల్ విసిరిన రోల్ అది!
అప్పుడప్పుడు ఆమె అనుభవం..తాజా పరిస్థితుల్ని ఉద్దేశించి హీరోయిన్లకు కొన్ని విలువైన సలహాలు ఇస్తోంది.
బాలీవుడ్ నటి రాణీముఖర్జీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ సీనియర్ నటి దూసుకుపోతుంది. వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఎక్కువగా లేడీ ఓరియేంటెడ్ కథల్లోనూ కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆమె అనుభవం..తాజా పరిస్థితుల్ని ఉద్దేశించి హీరోయిన్లకు కొన్ని విలువైన సలహాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కెరీర్ భారీ విజయం సాధించిన 'బ్లాక్' చిత్రం గురించి గుర్తు చేసుకుంది.
ఈ సినిమా అమ్మడి కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. అందులో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో ఆ నాటి సంగతులు ఇలా గుర్తు చేసుకుంది. `బ్లాక్ లో అమితాబ్ సర్ తో తెరను పంచుకోవడం నా అదృష్టం. ఆ సినిమా నన్ను ఓ మంచి నటిగానే కాదు ఒక ధృడమైన వ్యక్తిగా మలిచింది. షూటింగ్ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నాను.
వినికిడి లోపం..మాట్లాడటం రాని అమ్మాయి పాత్రలో నటించిడానికి నాలో ప్రేరణ కల్పించింది ప్రఖ్యాత రచయిత్రి హెలెన్ కెల్లర్. ఆపాత్ర నన్ను నాకే కొత్తగా పరిచయం చేసింది. మాటలు రాని వారు అదే పనిగా సంజ్ఞలు ద్వారా మనసులో ఉన్నది తరులతో తెలియజేయడం ఎంత కష్టమో అప్పుడు తెలిసింది. మహిళలను శక్తువంతులుగా..ధైర్యవంతులుగా చూడటం అంటే నాకు ఎంతో ఇష్టం.
అందుకే నేను కొన్ని అలాంటి సినిమాలు కూడా చేసాను. వాళ్లలో ఆలోచనల్ని ప్రేరేపించేలా స్పూర్తి రగిలించేలా చేయడం ముఖ్యం. సినిమా మాధ్యమంతో నా ఫరిదిలో కొంత వరకైనా అలా చేయగలగాలి. కనీసం ఆ రకమైన మార్పు అయినా తీసుకురాగలిగితే ఎంతో సంతోషిస్తాను. ఎప్పుడూ ఒకేలా ఉండటం కంటే లైఫ్ ని భిన్నమైన కోణాల్లో చూడగల్గాలి. అప్పుడే జీవితం అంటే ఏంటో అర్దమవుతుంది` అని అంది.