భారతీయుడు 2 : కమల్‌ కూడా ఉంటే బాగుండు!

దాదాపు ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్‌ అన్నట్లుగా రూపొందిన చిత్రం 'భారతీయుడు 2'.

Update: 2024-06-26 06:21 GMT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌ లో వచ్చిన భారతీయుడు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్‌ అన్నట్లుగా రూపొందిన చిత్రం 'భారతీయుడు 2'.

పాన్ ఇండియా రేంజ్ లో జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారతీయుడు 2 సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు అయిదు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. తీరా సినిమా విడుదల కాబోతున్న సమయంలో నెగిటివిటీ మేకర్స్ ను మరియు బయ్యర్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ట్రైలర్‌ విడుదల తర్వాత భారతీయుడు 2 సినిమా పై ఆసక్తి తగ్గిందని కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు సినిమాలో కమల్‌ హాసన్ కూడా ఉంటే బాగుండేది కదా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. భారతీయుడు 2 లో కమల్‌ గెటప్ పై వస్తున్న ట్రోల్స్ కి ఈ కామెంట్స్‌ పరాకాష్ట అనడంలో సందేహం లేదు.

కమల్‌ హాసన్ ను చూస్తున్నట్లుగా లేదని కొందరు అంటే, అసలు కమల్‌ హాసన్‌ ఈ సినిమాలో ఉన్నాడా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కమల్‌ మేకప్ విషయంలో దర్శకుడు శంకర్‌ నిరాశ పరిచాడు. అంతే కాకుండా కమల్‌ ను ఈ సినిమాలో 106 ఏళ్ల వయసు ఉన్న సేనాపతిగా చూపించబోతున్నారు.

ట్రైలర్‌ రిలీజ్ సందర్భంగా వందేళ్లు దాటిన ఓ వృద్దుడు ఇంతటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ఎలా సాధ్యం, దాన్ని ఎలా మీరు సమర్ధించుకుంటారు అంటూ జర్నలిస్ట్‌ ప్రశ్నించాడు. అందుకు శంకర్‌ చైనాలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ 120 ఏళ్లు పూర్తి అయినా కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు.

మొత్తానికి శంకర్‌ ఏదో మంచి పాయింట్‌ తీసుకున్నప్పటికి దాన్ని సినిమాగా మలిచే విషయంలో మాత్రం కొన్ని తప్పటడుగులు పడ్డాయేమో అన్నట్లుగా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మరియు విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కమల్‌ ను తన యధా రూపంలోనే చూపిస్తూ, సేనాపతికి లింక్ పెట్టినట్లయితే బాగుండేది అంటున్నారు. కమల్‌ ను డబుల్‌ రోల్‌ లో చూపించినట్లయితే మరింత బాగుండేదేమో అంటూ మరి కొందరు అంటున్నారు. అయితే సినిమా విడుదల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సమాధానం లభిస్తుంది అనేది చిత్ర యూనిట్‌ సభ్యుల అభిప్రాయం.

Tags:    

Similar News